పుట:Naajeevitayatrat021599mbp.pdf/603

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయాలని తను సూచన వ్రాసి వెంటనే రాజాజీ గదిలోకి స్వయంగా పైలు తీసుకువెళ్ళి ఆయన సంతకం కూడా పెట్టించి, తక్షణమే కార్యదర్శిచేత కోర్ట్ ఆఫ్ వార్డ్స్‌కు ఆజ్ఞాపత్రం పంపించారు. జమీందారు ఈ ఆర్డరు చూసిన తర్వాత కొంతవరకు తేరుకొన్నాడు. కాని, దురదృష్ట వశాత్తు అనారోగ్యంచేత ఆ తర్వాత త్వరలో ఆయన స్వర్గస్థుడైనాడు.

ఉద్యోగాలు పోయిన గ్రామోద్యోగులకు మళ్ళి ఉద్యోగాలు

బ్రిటిష్ గవర్నమెంటుకు రెవిన్యూ డిపార్టుమెంటు వెన్నెముకవంటిదని లోగడ వ్రాయడమైంది. రెవిన్యూ శాఖకు గ్రామోద్యోగివర్గం వెన్నెముక వంటిది. సహాయ నిరాకరణోద్యమ సమయాన అనేకమంది గ్రామోద్యోగులు నిస్వార్థమైన దేశభక్తితో తమ శక్త్యానుసారం ఉద్యమానికి సహాయంచేయడమే గాక, వారిలో అనేకులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు కూడా ఇచ్చారు. ఇది 1921 - 1939 మధ్య జరిగిన ఉదంతము. వీరిలో కొంతమంది బ్రతికి ఉన్నారు. ఉద్యోగంపైని మరల ఆశ కలవారు తమ ఉద్యోగాలు తిరిగి తమకు ఇప్పించ వలసిందని, రెవిన్యూమంత్రి అయిన ప్రకాశంగారికి అర్జీలు పెట్టడం మొదలుపెట్టారు. ఇది సర్వజనామోదకరం కావడంచేత కష్టమేమీ కాలేదు. రమారమి నూటఇరవైతొమ్మిదిమందికి, వారి ఉద్యోగాలు వారికి తిరిగి లభింప జేయడమైనది.

గ్రామోద్యోగులే కాక ఇతరులుకూడా 1930 లో ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో ఉద్యోగాల నుండి విరమించుకొన్నారు. వారిలో ఒకరు శ్రీపాద వెంకటనారాయణ గారు. ఆయన సబ్‌రిజిస్ట్రారుగా వుండి, ఉద్యోగానికి రాజీనామా చేసి ఉప్పు సత్యాగ్రహంలో నా నాయకత్వాన నడచిన దళంలో చేరారు. ఈయన ఉద్యోగంలో తిరిగి చేరడానికి వయ:పరిమితి దాటిపోయింది. అందుచేత ఆయన తనకు పెన్షన్ ఇప్పించాలని కోరారు. సచివాలయంవారు గట్టిగా అడ్డారు. అందులో రాజాజీ ఆర్థికమంత్రి కావడంచేత, వారు ధనం కావాలన్న అర్జీ ఏదివచ్చినా నిరాకరించవలెననే సూత్రం ఏర్పాటు చేసికోవడంచేత, పెన్షన్