పుట:Naajeevitayatrat021599mbp.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డానికి సందేహించారు. చివరికి మెట్రిక్యులేషన్ పాసయ్యాక కొంతధైర్యం వచ్చి, మా బావగారు నాకు కూతుర్ని ఇవ్వడానికి అంగీకరించారు.

మా అమ్మగారు అద్దంకిలో వివాహం చెయ్యడానికి నిశ్చయించి ముహూర్తం పెట్టించి కబురు పంపించింది. నేను మా అమ్మమ్మగారిని ముందు పంపించి 1890 ఫిబ్రవరిలోనో, మార్చిలోనో అద్దంకి చేరాను. రాజమహేంద్రవరంనించి బెజవాడదాకా కాలవమీద వచ్చి, అక్కడినించి గుంటూరుమీదుగా అంచెబళ్లమీద అద్దంకి చేరుకున్నాను. వివాహం చాలా సామాన్యంగా జరిగింది. కావలసిన బంధువులు నలుగురూ వచ్చి ఐదురోజులూ పెళ్ళి సులువుగా తేల్చారు. మా అమ్మగారు నా పెళ్ళితోబాటు మా చెల్లెలు అన్నపూర్ణ పెళ్ళి కూడా చేసింది. అప్పటికి అన్నపూర్ణకి సుమారు 8 సంవత్సరాల వయస్సు వుంటుంది. మా అమ్మగారు మా పెద్దఅప్పగారు చనిపోయింది కనక అన్నపూర్ణని మా బావగారికే ఇచ్చి వివాహం చేసింది. నేను పెళ్ళికి వచ్చేసరికే మా అమ్మగారు కార్యక్రమం యావత్తూ నిర్ణయించింది. మొత్తంమీద నా అభిప్రాయా లెల్లా వున్నా పెళ్ళి జరిగిపోయింది.

నా వివాహం అయిన వెంటనే మళ్ళీ కాలేజీలో చేరడానికి రాజమహేంద్రవరం వచ్చాను. అప్పటికి యమ్. యస్. యమ్. రైల్వేలైను వేస్తున్నారు. ఆ రోజుల్లో బెజవాడనించి సంతమావులూరువరకూ రైలు పడింది. నాకు యఫ్. ఏ. పుస్తకాలు ఒక మోపెడు వుండేవి. అవన్నీ ఒక మనిషి నెత్తిని పెట్టి, మా ఊరినించి నడిచి, సంతమావులూరు వచ్చి, అక్కడ రైలెక్కి, బెజవాడ చేరి, మళ్ళీ పడవమీద రాజమహేంద్రవరం చేరుకున్నాను. వివాహసందర్భంలో నేను చెప్పవలసిందల్లా ఆనాటి పెళ్ళిళ్ళసొంపు. పెళ్ళి అంటే వేలకివేలు మూట కట్టుకుని బెంగపడవలసిన అవసరం వుండేది కాదు. అయిదురోజులు పెళ్ళి అయినా నలుగురూ కలిసి పనిచెయ్యడంవల్ల సూక్ష్మంగా తేలిపోయేది. లక్షాధికారులైనా పల్లెటూళ్ళో ఉన్న భజంత్రీలమేళం, పల్లకీ, రామడోళ్ళూ మాత్రమే కుదుర్చుకునేవారు. భిక్షాధికారులైనా అంతే! వంట బ్రాహ్మణుల ఆర్భాటాలూ అవ్వీ ఏమీ లేవు. తరవాత నా చేతిమీదుగా