పుట:Naajeevitayatrat021599mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను మా కుటుంబంలో అయితే ఏమి, - హనుమంతరావు నాయుడుగారి కుటుంబంలో అయితే ఏమి - అనేక వివాహాలు చేయించాను. ఈ వివాహాల్లో ఆర్భాటమూ, ఆడంబరమూ, శ్రమేకాని, ఆనాటిసౌలభ్యమూ, సౌఖ్యమూలేవని అనిపిస్తోంది.

ఈ కాలంలో నా సహాధ్యాయుల్ని గురించీ, సహచరుల్ని గురించీ కొంచెం వ్రాస్తాను. నేటి సర్ కె. వి. రెడ్డినాయుడు నేను రాజమహేంద్రవరంలో చదువుకి ప్రవేశించి నప్పటినించీ కూడా నా సహాధ్యాయి. అతని తండ్రిగారు అప్పట్లో తాలూకా కచ్చేరిలో చిన్న బంట్రోతుగా వుండేవారు. అతను అరుగుమీద కూర్చుని చదువుకోవడం నా కిప్పటికి జ్ఞాపకం వుంది. అతనైతే క్లాసులో 'Good boy' అంటే - 'మంచి పిల్లవాడి' కిందే లెఖ్ఖ. నేను నా సహాధ్యాయుల్ని ఏదో విధంగా అదమాయిస్తూ వుండేవాణ్ణి. ఇన్ని సంవత్సరా లయిన తరవాత ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని వ్రాయడానికి నేను చాలా గర్వపడుచున్నాను. నా మిత్రుడు కూడా అల్లాగే గర్వపడతాడని అనుకుంటాను. "ఎటువంటి సామాన్య పరిస్థితుల్లోనించి మేము నిగ్రహించుకు వచ్చాము!" అని తలచుకున్నప్పుడు ఇదంతా నాకే ఆశ్చర్యంగా వుంటుంది. తరవాత మునిసిపల్ వ్యవహారాల్లో వెంకటరెడ్డి నాకు కొంచెం దూరం అయ్యాడు. క్రమంగా రాజకీయాల్లో మేము యింకా దూరులమై ఇప్పుడు కేవలమూ ప్రతికూల రాజకీయ పక్షాల్లో వున్నాము. కాని, వ్యక్తిగతంగా నా మనస్సులో వున్న ఆనాటి ప్రేమకేమీ కొరత కలగలేదు. అతనికీ అల్లాగే వుంటుందని నమ్ముతున్నాను.

మహమ్మదుబజులుల్లా సాహేబుకూడా నాకు సహాధ్యాయి. అతను ఎంతెంత పుస్తకాలైనా బట్టీ పట్టడంలో మంచి ఘనుడు; ఇంగ్లీషు బాగా వ్రాస్తా డనే ప్రతీతి వుండేది. అతను బి. ఏ. అయి, సర్వీసులో పడిపోయాడు గనక, ఆ పైన మాకు అంతగా సంబంధం లేకపోయింది. ఇక రాజమహేంద్రవరంలో ఇప్పటికీ జీవించి ఉన్న సారంగు భీమశంకరం కూడా నా సహచరుడే. అతని తమ్ముడు సోమసుందరమూ, నేనూ సహాధ్యాయులము. భీమశంకరం మాకన్న పెద్దక్లాసులో చది