పుట:Naajeevitayatrat021599mbp.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేకుండా, విరివిగా ధనసహాయం చేసిఉన్న కారణంగా, ఆ కంపెనీ మూసివేయడమంటే నా కదోలా అనిపించింది. చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడనిపిస్తోంది. ఆనాడు 1924 లో, గాంధీగారి సలహా ప్రకారం, ఈ సంస్థను మూసి ఉంటే, మా ఆస్తులు చిన్నం ఎత్తయినా పోయి ఉండేవి కావు. మాకు ఈ చిక్కులూ, ఈ క్షోభా, ఏవీ ఉండేవికావు.

నా విషయంలో నాకే బెంగా లేదు. నేను పుట్టింది ఒక బీదల ఇంటిలో, పెరిగిందీ బీదవారి కొంపల లోనే. ప్లీడరుగానూ, బారిష్టరుగానూ మాత్రం లక్షలు సంపాదించాను. దీర్ఘ కాలంగా నడచిన, ఒక పెద్ద దేశంయొక్క స్వాతంత్ర్యంకోసం జరిగిన శాంతియుత సమరంలో ప్రజలు వద్ద నుంచి సంపాదించిన లక్షలు, ఆ ప్రజల స్వాతంత్ర్యంకోసం ఆనందంగా ఖర్చు పెట్ట గలిగాననే భావన నామట్టుకు నాకు ఆనంద దాయకంగానే ఉంది. నాతో, నా దృక్పథంతో ఆలోచించి చూడగల శక్తి నా భార్యకూ, పిల్లలకు లేకపోయినా, జీవితమన్నది కేవలం వ్యక్తిగతంగా ఒక్కొకరమే బ్రతకడానికి కాదనీ, ఇతరుల కోసంకూడా మనం బ్రతకవలసి ఉంటుందనీ గ్రహించడాన్ని చాలా ఘనమయిన త్యాగాలు చేయగలిగాం. ఏ విధమయిన అనిష్టతా చూపించకుండా, మనస్సులో నయినా సణుక్కోకుండా, ఆస్తిపై వారికున్న అన్ని హక్కులూ, నా భార్యా, పిల్లలూ ఆనందంగా వదులుకున్నారు.

నిజాని కివి మా కుటుంబానికి చాలా కష్టపు దినాలు. 'స్వరాజ్య' కంపెనీకి అప్పిచ్చినవారిలో ఒకే ఒక ఋణదాత, నేను జైలులో ఉన్న సందర్భంలో, మా కుటుంబానికి విపరీతమయిన నష్టాన్ని కలుగజేయగలిగాడు.

'స్వరాజ్య' కంపెనీని ఎల్లా అయితే రక్షించు కోలేకపోయానో, అదే ప్రకారంగా నా భార్య జీవితాన్నికూడా కాపాడుకోలేకపోయాను. 1932 జూలైలో నేను విడుద లయ్యాను. అదే సంవత్సరం నవంబరు మాసంలో ఆమె దివంగతురాలయింది. ఇవీ 1932 నాటి నా వెల్లూరు జెయిలు ముచ్చట్లు.