పుట:Naajeevitayatrat021599mbp.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉప్పు సత్యాగ్రహ సమరంలో పాల్గొనడానికి పిలుపుగానూ చాలా బాగా ఉపయోగపడింది. అసెంబ్లీ మెంబరుగా పనిచేసిన ఆ మూడు సంవత్సరాలపాటూ నా శక్తివంచన లేకుండా, ఏ ఉడుతా భక్తిగానో, సేవచేశాను. ఆంధ్ర రాష్ట్రీయులకే గాక, ఎన్నో ఇతర రాష్ట్రాలవారికీ, ఖండాంతర వాసులకీ కూడా కాంగ్రెసు కార్యక్రమం విషయమై కాంగ్రెసుద్వారా జరుగుతూన్న, జరుగగల దేశోపకారాల విషయమై నేను కలిగించ గలిగిన పరిజ్ఞానం కలిగించాను.

ఆ కారణం చేతనే ఉప్పు సత్యాగ్రహమే కాదు, మరే యితర శాసనోల్లంఘన కార్యక్రమమయినా అసెంబ్లీ స్థానాలను వదలకుండా సాగిస్తే ఎక్కువ శక్తివంతంగా శీఘ్రతరంగా విజయం సాధించగలమని నా నమ్మిక. పరిస్థితుల ప్రాబల్యంవల్ల కాంగ్రెసుతో దెబ్బలాడి, రాజీనామా యిచ్చి, మళ్ళీ శాసన సభా ప్రవేశం చేయగలిగాను. అంతేకాదు, ఆ ఆఖరు ఘడియలలో కాంగ్రెసు మెంబర్ని కాకపోయినా కాంగ్రెసుకు జీవంపోసే విధంగా ప్రవర్తించగలిగాను.

అందువల్లనే అసెంబ్లీ హాలులో కాంగ్రెసు కార్యక్రమాలమీద విమర్శలు ముమ్మరంగా వస్తూన్న ఆ సమయంలో, ఆ విమర్శల కన్నింటికీ జవాబుగా ఒక స్టేటుమెంటు ఇవ్వగలిగాను. ఆ విమర్శల కన్నింటికీ జవాబు యిస్తూ, కాంగ్రెసుకు సహకారం అందివ్వవలసిందని దేశానికి కూడా విజ్ఞప్తి చేయగల సావకాశం నాకు లభించడం ఎంతటి అదృష్టమో గదా!

'ఆత్మ ప్రబోధం'

కాగా ఈ నా ఉపన్యాసానికి ఏ విధమయిన ముందు ప్రయత్నమూ జరగలేదు. ఆ క్షణంలో మాట్లాడింది నేను కాదు. "నా ఆత్మ." అది నిజంగా ఆత్మ ప్రబోధమనే నా పూర్తి విశ్వాసం. [1] ఉపన్యాసంలో అహింసాత్మక శాంతి సమర విధానానికి, రక్తపాతంతో కూడుకున్న

  1. ఈ ఉపన్యాసం సంపూర్ణంగా గ్రంథం చివర 'ఎపెండిక్స్‌' గా ఇద్దామని ఉద్దేశపడ్డారు.