పుట:Naajeevitayatrat021599mbp.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తలుస్తున్నారయ్యా? ప్రపంచకంలో ఎప్పుడయినా ఇటువంటి వింత విన్నామా?" అన్నాడాయన. "కాస్సేపు ఓపిక పట్టవయ్యా, మిత్రమా! ఈ విషయమై కొద్దిసేపట్లో శాసన సభలో మాటాడదలిచాను. అప్పుడు మీ ప్రశ్నకు సమాధానం సువిదతమవుతుం" దన్నాను.

ఆయనే అన్నమాటేమిటి, సభలో అధికార అనాధికార భారతీయ సభ్యులుకూడా కాంగ్రెసు కార్యక్రమం పట్ల విచారాన్ని సూచిస్తూ, 'దేశంలో ఉన్న కాంగ్రెసువారంతా రాజీనామాలిచ్చి, అన్ని విధాలా చేతులు నలుపుకుంటూన్న ఈ సమయంలో, ఈ సత్యాగ్రహం ఏమిటని అడగడం ఆరంభించారు. వారికీపై విధంగానే సమాదానం ఇచ్చాను.

సంశయాళువులకు సమాధానం

లోగడ చెప్పినట్లు 1930 లో నాకు ఏ విధంగానూ శాసన సభా కార్యక్రమాలలో పాల్గొనాలనే అభిప్రాయంలేదు. నా ఢిల్లీ ప్రయాణ కారణం విఠల్‌భాయ్‌గారి సందేశం. వారికి నా రాకవల్ల ఉపయోగం కలిగినా, కలగకపోయినా, నాకు మాత్రం ఆ ఢిల్లీప్రయాణం గర్వకారణమే అయింది. మాలవ్యా పండితునితో సహా (నేనుగాక) 13 మంది శాసన సభ్యులచేత రాజీనామా ఇప్పించి, వారిలో 12 మందిని ప్రత్యక్ష చర్యగా ప్రవేశపెట్టబడిన ఆ ఉప్పు సత్యాగ్రహ సమరంలోకి లాక్కెళ్ళగలిగాను. విఠల్‌భాయ్‌ని ఒప్పించి, ఆయనచేత రాజీనామా ఇప్పించి, జెయిలుకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసే సమయానికి గాంధీగారు 'దండీ' సమీపిస్తున్నారు.

అసెంబ్లీ కాంగ్రెసేతర సభ్యుడుగా నాకు ఉన్న హక్కుని పురస్కరించుకుని, నేను చేసిన ఉపన్యాసం అసెంబ్లీలోనూ, దేశంలోనూ ఉన్న డౌటింగ్ థామస్[1] లకు సమాధానంగానూ, గాంధీగారి

  1. యేసుక్రీస్తు వారికి ముఖ్యమయిన శిష్యులు పదిమందిలోనూ థామస్ ఒకడు. ఆయనకి, మన పరమానందయ్య శిష్యులకు వచ్చినట్లు, ఎప్పుడూ అనుమానాలు వస్తూండేవి. అందుచేత ఆయన్ని అందరూ 'డౌటింగ్ థామస్‌' ( Doubting Thomas) అనేవారు.