పుట:Naajeevitayatrat021599mbp.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చర్యలో పాల్గొనవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రత్యక్ష చర్య అంటే అపహ్యించుకునే ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తామంటూ ఒక క్రొత్త పార్టీ స్థాపించాడు. ఇవి ఆయన ఘనకార్యాలు.

7

కాంగ్రెసుపై నా తిరుగుబాటు

శాసన సభ నుంచి వై దొలగి, శాసన ధిక్కారానికి దిగిన ఉదంతాన్ని గురించి కాస్త ప్రస్తావించాలని ఉంది. సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం అత్యంత విజయవంతంగా, శాసన సభలో సభ్యులంగా ఉంటూనే నడిపించాము. చాలాకాలం తర్వాత 1940 లో ఏడు రాష్ట్రాలలో కాంగ్రెసు ప్రభుత్వాలను నడుపుతూ, శాసన సభ్యత్వాలకూ, మంత్రిత్వాది హోదాలకూ రాజీనామాలు ఇవ్వకుండానే జెయిళ్ళకి సిద్ధమయి పాల్గొనిన శాసన ధిక్కారపు టలజడిలో తిరిగీ ఒక ఘన విజయాన్నే సాధించాం.

మోతీలాల్‌గారితో భేదాభిప్రాయం

అ 1921 నాటి మొదటి శాసన ధిక్కారపు రోజులలో శాసన సభా సభ్యత్వాలకు రాజీనామా లిచ్చి ప్రత్యక్ష చర్యకు దిగి విజయాన్ని సాధించి ఉన్నా, 1930 లో బ్రిటిషువారికి సవాలుగా ఇచ్చిన సంవత్సరం గడువూ తీరి, 1930 లో ప్రత్యక్ష చర్యకు పూనుకునే ముందు మా శాసన సభా సభ్యత్వాలకు రాజీనామాలు ఇవ్వనవసరం లేదని నేను ఎంత వాదించినా, మోతీలాల్‌గారు ఒప్పుకోలేదు. ఆయన తనకు గలిగిన పార్ల మెంటరీ అనుభవాలతో విసుగు చెంది ఉన్నాడు. అందువల్ల ఆయన రాజీనామా లిచ్చి తీరాలని పట్టుపట్టాడు.

మోతీలాల్‌గారిని లాహోరు కాంగ్రెసు రోజులలో త్రివిధ బహిష్కరణ విధానాన్ని తిరిగీ అమలు జరుప వలసిందని కోరినప్పుడు, ఆయన ఈ విషయంలో తాను, గాంధీగారి అనుమతితోనే, పాల్గొన