పుట:Naajeevitayatrat021599mbp.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విషయాలన్నీ ప్రజలు గ్రహించడానికి వీలుగా ఆయన సబర్మతి నుంచి కాలినడకని, 'దండీ' చేరడానికి ఇరవయ్యొక్క రోజుల కార్యక్రమం వేశాడు. రోజు తర్వాత రోజు ఆయన తన ఆశ్రమవాసులైన స్త్రీ పురుషులతో కలిపి యాత్ర సాగిస్తూ, దారిలో అక్కడక్కడ ఇస్తూ వచ్చిన చిన్న చిన్న ఉపన్యాసాలు దేశానికి నిద్రమత్తు వదలగొట్టాయి. ఉప్పును ఏరుకోడానికి దండీకి ఆశ్రమవాసులతో దండయాత్రగా గాంధీగారు వెళ్ళడం అన్నది చరిత్రాత్మకమై, దేశీయుల కందరికీ ప్రత్యక్షపాఠం అయింది.

ఈ పరిస్థితులే నాకు ఉత్సాహా న్నిచ్చి కేంద్ర శాసనసభలో నాచేత జోస్యం చెప్పించి, జయం తధ్య మని పలికించాయి. దారి ఎప్పుడయితే చూపబడిందో, మూలసూత్రం చెడకుండా నూతన మార్గాన్వేషణలు చేయగలిగిన మన నాయకులు కొద్ది రోజులలోనే రకరకాల కార్యక్రమాలు నిర్ణయించుకో గలిగారు. ప్రభుత్వంవారు ఆయన్ని నిర్భందిస్తే చేయవలసిందేమిటో కూడా స్పష్టం చేయడంచేత కాంగ్రెసు కమిటీలూ, ప్రజాసమూహాలూ కలిసి, ప్రపంచం కనీ వినీ ఎరుగని రీతిగా, ఒక బ్రహ్మాండమయిన 'శాంతి' యుద్ధంలో ఊహించడానికి సాధ్యంకానంత ఘనంగా విజయాన్ని సాధించడం జరిగింది.

దక్షిణ హిందూ దేశంలో ఈ ఉప్పు సత్యాగ్రహం నడచిన తీరును గురించి చెప్పేలోపల, 1929 నాటి లాహోరు కాంగ్రెసు చరిత్ర, అచ్చట ఎగరవేసిన స్వతంత్ర పతాకాలను గురించీ టూకీగా చెపుతాను.

లాహూరు కాంగ్రెస్ అధ్యక్షత

1921 నుంచి జరిగిన ప్రతి కాంగ్రెస్సూ ఏదోవకరకంగా ఉత్సాహోద్రేకాలను కలిగించి చరిత్రాత్మకమే అయింది. ప్రతీకాంగ్రెస్‌కూ తండోపతండాలుగా జనం రావడమూ, ఉత్సాహపూరిత హృదయాలతో దానికి జీవం పొయ్యడమూ మామాలయింది. కాని ప్రత్యక్ష చర్యలతో విజయాన్ని సాధించడానికీ, విజయవంతంగా కాంగ్రెస్‌ను నడపడానికీ చాలా తేడా ఉంది. అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడం అన్నది ఒక పెద్ద ప్రాధమిక సమస్య. కలకత్తా కాంగ్రెస్‌లో మహాత్మా గాంధీగారి దర్శకత్వాన