పుట:Naajeevitayatrat021599mbp.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటన్‌ కిచ్చిన అల్టిమేటం

బ్రిటిషువారికి ఆఖరి సంధి షరతుగా ఇచ్చిన ఈ అల్టిమేటం తీర్మాన రూపం దాల్చేముందు గాంధీగారికీ, సుభాస్‌చంద్రబోస్, శ్రీనివాసయ్యంగార్లకీ మధ్య ఒక ఆశాజనకమైన, ముచ్చట గొలిపే వాదన జరిగింది. గవర్నమెంట్‌వారు భారత దేశానికి రాజ్యవిధానంలో ఏవో మార్పులు చూపిస్తామని అంటున్నారు గనుక, వారికి 24 మాసాల గడువు ఇవ్వాలని గాంధీగారు సూచించారు. అ వాయిదా అతి దీర్ఘం అయిపోతుందని బోస్, శ్రీనివాసయ్యంగార్లు అన్నారు. అప్పుడు గాంధీగారు ఏడాది గడువుకు ఒప్పుకున్నారు.

ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ, "మీరు యీ ఏడాది నాటికి దేశాన్ని శాసన ధిక్కారాదులకు తయారు చేయవలసిన బాధ్యత వహించవలసి ఉంటుం" దన్నారు. గాంధీగారు ఏడాది నాటికి దేశాన్ని సిద్ధం చెయ్యవలసి ఉంటుందన్న మాటలలోని అంతరార్థం శ్రీనివాసయ్యంగారికి గ్రాహ్యం అయినట్లు లేదు.

కలకత్తాలో అంగీకరించబడిన కాంగ్రెస్ తీర్మాన ప్రకారంగా తెలియవచ్చే దేమిటంటే, కాంగ్రెసువారు కోరిన ఆ కనీసపు కోరిక నయినా 1929 డిసెంబరు 31 వ తేదీ అర్ధరాత్రికి ఆంగ్లేయులు అంగీకరించకపోయినట్ల యితే దేశాన్ని శాసన ధిక్కారం చేయవలసిందని కోరవలసి ఉంటుందనీ, శాసనోల్లంఘనం అంటే పన్నుల నిరాకరణ సాగిస్తామనీ, ప్రభుత్వం వారినుంచి యే విధమయిన సహకారమూ కోరకుండా (తమ్ము తామే కాపాడుకుంటూ, ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడపబడడం వరకూ) తమ్ము తామే చూచుకుంటామనీ ఆ తీర్మానంలో సూచించబడింది.

గాంధీగారికి తిరిగి కాంగ్రెసు అప్పగింత

దీన్తో కాంగ్రెసులోని రెండు విభాగాలవారూ ఐక్యమయి ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటారని తేలింది. అంతేకాదు. 1924 లో బెల్గాంలో దాస్ - మోతీలాల్‌గార్ల పరమయిన కాంగ్రెసు నేడు తిరిగి