పుట:Naajeevitayatrat021599mbp.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏప్రియల్ 11 వ తేదీని అధ్యక్షుడు, తాను సూచించిన ఆ ప్రాథమిక సూత్రాల మీదే, ఆ బిల్లును త్రోసివేశాడు. అప్పుడు వైస్రాయ్‌గారు శాసన సభనీ, స్టేటు కౌన్సిల్నీ ఉమ్మడి సమావేశానికి పిలిచి, ఆ సమావేశంలో ఆ ప్రజారక్షణ బిల్లును ఆమోదింపజేశాడు. ప్రభుత్వంవారి నిరంకుశ పరిపాలనకీ, వైస్రాయ్‌గారి నికృష్ట విధానానికీ ఇంతకంటె ప్రబలమయిన నిదర్శనం ఇంకోటి కావాలా?

ప్రజాభిప్రాయాన్ని కాదని తమకు ఇష్టం వచ్చినట్లు నిరంకుశంగా ప్రవర్తించ డానికే వైస్రాయ్‌గారు సర్టిఫికేషన్ పవర్ని తమచేతిలో పెట్టుకుంట. అటువంటి బిల్లు విషయంలో జరిగే సర్టిఫికేషన్ తతంగాల్ని ఆపు చెయ్యడానికి శాసన సభవారికి అధికారం లేక పోయినా, ఉన్నత స్థాయిలో జరుగుతూన్న తర్కవితర్కాలు ప్రజా హృదయంలో ఉత్తేజాన్ని కలిగించడానికి, ముఖ్యంగా అమాయకపు బాధితుల హృదయాలు తేలిక అవడానికి ఉపకరించేవి. సహకార నిరాకరణ ఉద్యమం, 1921 లోనే ప్రారంభించబడి, ప్రత్యక్ష చర్య, నిర్మాణ కార్యక్రమాలద్వారా, ప్రజాహృదయంలో నూతన ఉత్సాహాన్నీ, శక్తినీ, కలిగించ గలిగినా, 1923 - 29 సంవత్సరాలలోకూడా శాసన సభాసభ్యులకు ఇటువంటి అన్యాయ పరిస్థితులలో కాంగ్రెసువారితో కలిసి ఓటు చేయడానికి 'కలేజా' లోటుగానే ఉండేది.

వైస్రాయికే మందలింపు

వైస్రాయిగారు శాసనసభా, రాజ్యసభా సభ్యులను ఉమ్మడిగా సమావేశపరచి, అ ఉమ్మడి సభలోని స్టేట్ కౌన్సిల్ సభ్యుల ధర్మమా అని వారి ఓట్లతో బయట బయటపడేవారు. అప్పుడుకూడా రాజ్యాంగపు కట్టుబాట్లకు లోబడి, ఉభయ సభల ఆమోదం పొందిన ఆ బిల్లుల్ని కూడా చట్టంగా ప్రకటించడానికి ఒక ఆర్డినెన్స్ కావలసి వచ్చేది.

ఇటువంటి పరిస్థితులలో లేని 'పూచీ'ని సృష్టించి, తాను సృష్టించిన ఆ 'పూచీ' ఆధారంగా, వైస్రాయినికూడా, "నీవు అనవసరంగా మా కార్యకలాపాలలో కలుగజేసుకుంటున్నా"వని మందలించగలశక్తి ఒక్క విఠల్‌భాయ్ పటేల్‌కే ఉంది. అట్టి ధీరశాలి ఆయన