పుట:Naajeevitayatrat021599mbp.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆగలేదు. నినాదాలతోటీ, కాల్పులతోటీ, ఒక చావుతోటీ జరిగిందన్న మాట! నడుస్తూన్న గుంపులమీద అనవసరంగా లాఠీచార్జీలు అవీ జరిపి, గుంపులను ఉద్రిక్త పరిచారని విన్నాను.

జనం మాత్రం పూర్తి హర్తాలు జరిపి, శాంతి భద్రతలు బాగా పాటించారని ఒప్పుగోక తప్పదు. హర్తాలు నడచిన తీరూ, ప్రజలు చూపించిన సహనం, వారు శాంతి భద్రతలు కాపాడిన విధం, అన్నీ కూడా కాంగ్రెసులోనూ, కాంగ్రెసుయొక్క అహింసా తత్వంలోనూ ప్రజలు ఎంత విశ్వాసంతో వ్యవహరిస్తున్నారో, కాంగ్రెసు ఆదేశాలు ఎంత బాగా ప్రజలలో నాటుకునిపోయాయో బాగా విశదం చేశాయి.

1927 డిసెంబరులో మదరాసు కాంగ్రెసే, సైమన్ బాయ్‌కాట్ ప్రతిపాదనని ఆమోదించింది. ఆ మదరాసులోనే, మాకు అవసరం లేదు మొర్రో అంటూన్న ఆ సైమన్ కమిషన్ కారణంగా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించాయి. ఎప్పుడయితే కాంగ్రెస్ బహిష్కరణ తీర్మానాన్ని ప్యాసు చేసిందో, ఆ తీర్మానం సక్రమంగా అమలు జరిగిందీ - లేందీ చూడవలసిన పూచీ కాంగ్రెసు నాయకుల మీద ఉంది.

మోతిలాల్ సవరణ

సెంట్రల్ అసెంబ్లీలో 1928 ఫిబ్రవరి 16 వ తేదీని లాలా లజపతిరాయ్‌గారు సైమన్ కమిషన్ని పూర్తిగా బహిష్కరించ వలసిందంటూ కేంద్ర శాసన సభలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. మోతిలాల్‌నెహ్రూగారు దాని కోసవరణ ప్రతిపాదించాడు. సైమన్