పుట:Naajeevitayatrat021599mbp.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బెల్గాం కాంగ్రెస్‌లో పోటీ తీవ్రరూపం దాల్చింది. ఓటింగు చాలా ముమ్మరంగానే సాగింది. దాస్-మోతిలాల్‌ గార్లపై గాంధీగారికే విజయం లభించింది. అయినప్పటికీ కూడా, తనకు లభించిన విజయం అత్యల్పమైన మెజారిటీతో లభించినదన్న కారణంగా, కాంగ్రెసును దాస్-మోతిలాల్ గారల పరం చేయడానికి తాను సంసిద్ధుడననీ, వారు తమ "కౌన్సిల్ యెంట్రీ" పదకాన్ని నిశ్చింతగా అమలు జరుపుకోవచ్చుననీ చెప్పి ఆయన తప్పుకున్నారు.

కాన్పూరు కాంగ్రెస్

అఖిల భారత చరఖా సంఘ స్థాపన కర్త మహాత్ముడే. ఆ చరఖా సంఘాన్ని స్థాపించి ఆయన ఖాదీ విభాగాన్ని కాంగ్రెసునుండి విడదీసి, దానికి ప్రత్యేక స్థాయిని సంపాదించారు. తాను అఖిల భారత చరఖా సంఘ అధ్యక్ష పదవిని స్వీకరించి, కాంగ్రెసును స్వరాజ్య వాదులకు అప్పగించారు. ఈ విధంగా గాంధీగారు నిర్మాణ కార్యక్రమం విభాగానికి ఒక విధంగా అంకితమే అయ్యారు.

దాస్-మోతిలాల్‌గారలు, ధైర్యంగా ముందుకు వచ్చి, వెంటనే "కౌన్సిల్ ఎంట్రీ" విధానాన్ని కాంగ్రెసు అంగీకరించేటట్లు చేయలేకపోయారు. వారు మరుసటి సంవత్సరం సరోజనీదేవి అధ్యక్షతను జరిగిన కాన్పూరు కాంగ్రెస్ [1] వరకూ ఆగవలసి వచ్చింది. ఆ కాన్పూరు కాంగ్రెసులో తాము "కౌన్సిల్ ఎంట్రీ" విధానాన్ని అవలంబించి, కాంగ్రెసు టిక్కెట్టుమీద ఎన్నికలలో పాల్గొనడానికి నిశ్చయించారు.

ఎన్నికల సంరంభం

1926 లో జరిగిన జనరలు ఎన్నికలలో దేశం మొత్తంమీద ఎన్నో ప్రాంతాలనుంచి కాంగ్రెసు టిక్కట్టుమీద రాజ్యసభకి యెన్నిక

  1. కాన్పూరు కాంగ్రెసు (1925)లో కాంగ్రెసువారు స్వరాజ్య పార్టీవారి శాసన సభా ప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టి, ఎన్నికలలో పాల్గొనడానికి నిశ్చయించారు.