పుట:Naajeevitayatrat021599mbp.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయ్యారు. నేను గుంటూరు, కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలకు ప్రతినిధిగా రాజ్యసభికి ఎన్నిక అయ్యాను. రాజ్యసభకే అన్న మాటేమిటి, శాసన సభలకు కూడా చాలా రాష్ట్రాలలో అనేక అభ్యర్థులు కాంగ్రెసు టిక్కట్టుమీదనే ఎన్నిక అయ్యారు. నిజంగా కాంగ్రెసువారే తలుచుకుని ఉంటే, మంత్రులయి పరిపాలనా యంత్రాన్ని చేబట్టి, 1921 నుంచీ అవిచ్చిన్నంగా సాగుతూన్న జస్టిస్‌పార్టీ వారికీ, వారి పరిపాలనా విధానానికీ స్వస్తి చెప్పేవారు. కాని కాంగ్రెస్ వారికి మంత్రు లమవుదాం అనే ఉద్దేశం లేదు.

చెన్నరాజధానిలో మాత్రం, అధిక సంఖ్యాకులుగా కాంగ్రెస్ వారు శాసన సభకు ఎన్నిక అయిన కారణంగా, మంత్రి పదవులు సంపాదించి, రాజ్యాంగాన్ని చేపట్టి, చేపట్టిన రాజ్యాంగ చక్రాన్ని నడపకుండా, బినామీగా ఉండాలనే అభిలాష జనించింది. జనించిన అభిలాషకు తల ఒగ్గారు. ఈ విషయాన్ని మున్ముందు బాగా విస్తరిస్తాను.

బెల్గాంలో కాంగ్రెసు జరిగిన తర్వాత మొదటిసారిగా అఖిల భారత కాంగ్రెసు కమిటీవారి మీటింగు పాట్నాలో జరిగింది. గాంధీగారు ఒక్క సంవత్సరం పాటు అన్నిరంగాల నుండి రిటయిరవుతానన్నారు. ఆ ప్రకారం , పాట్నా కాంగ్రెసులో, తమకూ కాంగ్రెసుకూ మధ్యనున్న వ్యవహారాలన్నిటినీ చక్క పెట్టుకుని, స్వరాజ్యవాదుల అంగీకారాన్ని కూడా లాంచన ప్రాయంగా తీసుకున్నారు.

13

గాంధీగారు, స్వరాజ్య పత్రిక

నేను కాంగ్రెసు మీటింగులన్నిటికీ హాజరయి, చేయగలిగిన యథోచిత సేవచేస్తూ ఉండేవాణ్ణి. కాగా "స్వరాజ్య" పత్రికలో విషయాలన్నీ వివరిస్తూ, కాంగ్రెసు అభివృద్ధికీ, దేశక్షేమానికి పాటుబడేవాణ్ణి. అంతేకాదు-మోతిలాల్ నెహ్రూలాంటి నాయకుణ్ణి కూడా, తప్పుదారిని