పుట:Naajeevitayatrat021599mbp.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాస్‌గారు తమకు లభించిన ఢిల్లీ అనుమతి కాకినాడలో తిరగ తోడబడుతుందేమోననే భయంతో, అంతవరకూ చాలా ఆదుర్దాగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ బెంగాలు శాసన సభలో కాంగ్రెసు పార్టీకి నాయకుడిగా ఉంటూ ఉండిన కిరణ శంకర్‌రాయ్‌గారు, నన్ను కలుసుకుని మాటలాడి ఎల్లాగయినా ఢిల్లీ ప్రతిపాదన నిలబడేటట్లు చూడమని కోరారు. ఈయన్ని ప్రత్యేకంగా ఈ పనికోసం నియోగించి దాస్‌గారు పంపించారు. ఆయన వందలాది మైళ్ళు ప్రయాణం చేసి ఈ పనిమీదే బెజవాడ వచ్చారు.

మా వ్యక్తిగత స్నేహ బాంధవ్యాలు, వ్యక్తిగత అభిప్రాయాలతో ఎప్పుడూ ముడిపడి ఉండలేదు. మా రాజకీయాలన్నీ రాజకీయాలుగానూ, స్నేహాలు స్నేహాలుగానే ఉండేవి. అయినప్పటికీ ఆయనతో సహకరిస్తానని వాగ్దానం చేశాను. గాంధీగారు నిర్భంధంలో ఉండగా, నాయకులతో విభేదాలు కారణంగా దేశంలో పరిస్థితులు క్లిష్టతరం కావడం వాంఛనీయం కాదనే నా ఊహ.

వరదలతోనూ, తుపానులతోనూ ఆ సంవత్సరం ప్రజలను ఎటువంటి బాధలకు గురిచేసినా, 1923 రాజకీయంగా మాత్రం ఉపకరించింది. ఏ దృక్పథంతో చూసినా కాకినాడ కాంగ్రెసు బ్రహ్మాండమయిన విజయాలు సాధించిందనే చెప్పాలి. ఆంధ్రులమయిన మనకు ఆ కాంగ్రెసు నిజంగా గర్వకారణమే. ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారు, తమ అధ్యక్షోపన్యాసాన్ని హిందీలో ఇచ్చారు. ఆంధ్ర యువతీ యువకులు శక్తివంచన లేకుండా సహాయపడ్డారు. ఆంధ్ర దేశానికి జెందిన అన్ని జిల్లాలలోని వ్యాపారస్థులూ, వర్తకులూ, కృషీవలులూ లేదనకుండా వారికి తోచిన సహాయం, ఆర్ధికంగానే గాక అనేకవిధాల సహాయపడ్డారు.

మహర్షి అతిథ్యం

కాకినాడ కాంగ్రెసు చరిత్ర (మహర్షి) బులుసు సాంబమూర్తి గారిని తలపెట్టకుండా ముగించకూడదు. కాంగ్రెసు ఏర్పాట్లన్నీ ఆయన