పుట:Naajeevitayatrat021599mbp.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసన సభా ప్రవేశ వివాదం

సత్యాగ్రహ సమర ప్రారంభ కాలంనుంచీ దాస్‌గారూ, నేనూ సన్నిహితులంగానూ, ముఖ్య స్నేహితులంగానూ ఉంటూ ఉన్నా, ఇంతవరకూ ఆయా సందర్భాలలో చెప్పినట్లు, గాంధీగారి పద్ధతులకు భిన్నంగా ఆయనా, మోతిలాల్ నెహ్రూగారు కలసి పన్నిన కుట్రలో నేను యిరుక్కోలేదు. కాగా వారు ప్రారంభించిన స్వరాజ్యపార్టీ అన్న దాంట్లోనూ నేను కలుగ చేసుకోలేదు. ఆ స్వరాజ్యపార్టీయే కాలక్రమేణా కాంగ్రెసు కౌన్సిల్ పార్టీగా మార్పు చెందింది.

గాంధీగారు ఈ సత్యాగ్రహ ఉద్యమాన్ని దాస్-మోతిలాల్‌గార్ల సలహా సంప్రతింపులతో ప్రారంభించి ఉండడంచేత వారికి తన విధానాలపట్ల విముఖత గలుగుతూన్నట్లు విశదం అవుతూ ఉన్నా, వారి మానాన్ని వారిని వదిలి, తన మానాన్ని తాను, తను నమ్మిన పద్ధతిలో, ప్రజల సహాయంతో, ఉద్యమాన్ని నడుపుకుంటూ ముందుకు పోలేక పోయారు. రాజగోపాలాచారి మొదలైన కార్యనిర్వాహకవర్గ సభ్యులందరూ కలిసి, త్రివిధ బహిష్కార విధానానికి రెండు మాసాలపాటు విరామం ఇవ్వడమూ, శాసన సభల విషయంలో ఉన్నటువంటి బహిష్కరణను పూర్తిగా ఎత్తివేయడమూ, తరవాత శాసన సభా ప్రవేశ కౌన్సిల్ ఎంట్రీ విధానానికి అంగీకరించడమూ ఇత్యాదులన్నీ, ఏదో విధంగా జైలులో ఉన్న గాంధీగారితో సంప్రతించే చేస్తున్నారని చాలా మంది నమ్ముతున్నా, నిజానికి రెండు సంవత్సరాలకు పైగా నిర్భంధంలో ఉన్న మహాత్మునికి బైట ఏం జరుగుతూందో ఈషణ్మాత్రమూ తెలియదు.

గాంధీగారినీ, వారి తత్త్వాన్నీ ఎరిగి ఉన్న నేను, ఈ పనులన్నీ వారి ఎరుకతోటీ, అనుమతతోటీ (కాగితంమీద లేకపోయినా) జరుగుతున్నాయని ఎప్పుడూ నమ్మలేదు. 1923 ఫిబ్రవరి మాసంలో వర్కింగు కమిటీతో నాకున్న సంబంధాన్ని తెంచుకున్నాను. అప్పటికి గాంధీగారు నిర్సంధింపబడి ఏడాది అయి ఉంటుంది. వర్కింగు కమిటీనుండి వైదొలగిన తర్వాత నాకు దాస్‌గారి ప్రోగ్రాంతోగాని, రాజగోపాలా