పుట:Naajeevitayatrat021599mbp.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీద కొంపలు అంటుకుంటాయన్న సంగతే మాకు స్ఫురించక పోవడం దురదృష్టం. అప్పటికీ కొందరు మిత్రులు రాబోవు విపరీత పరిణామాల విషయం హెచ్చరికలు చేశారు.

మోతిలాల్ రాజాజీగార్లు కలిసి సమిష్టిగా హిందూ-మహమ్మదీయ సఖ్యసాధనకు పాటు పడడానికి బదులు, వారిలో వారు "నో చేంజ్" "ప్రో చేంజ్" విధానాల పేరిట వివాదాలలోపడి, తమ తమ పార్టీల అభివృద్దుల కోసమే పాటుపడ్డారు గాని సత్వర చర్యలు తీసుకోకుండా "అత్తగారి మీదకోపం కొద్దీ కూతుర్ని కుంపట్లో కూచోపెట్టిం"దన్న సామెతగా, ముల్తాన్ బాధితులను సమయానికి ఆదుకోడానికి బదులు, మంజూరైన పదివేల విరాళాన్నీ త్రొక్కిపెట్టి, ఉద్యమానికే తీరని అపకారం చేశారు. పార్టీల బలాబలాలు వృద్దిచేసుకునే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ప్రచారంచేసి తమ తమ అభిప్రాయాల కను గుణంగా లోకుల్ని మార్చాలనే తాపత్రయంతో భారతదేశపు టన్ని మూలలకూ వెళ్ళి దాస్, మోతీలాల్‌గార్లు ప్రచారాలు సాగించారు.

షహజాన్‌పూర్ సంఘటన

ముల్తాన్ సంఘటనల అనంతరం, పండ్రెండుమాసాల తర్వాత షహజాన్ ఉదంతం జరిగింది ఈ రెండు ఉదంతాల మధ్యకాలం అంతా, "నో చేంజ్", "ప్రో ఛేంజ్" పార్టీల స్వంత ప్రచారాలతోనే వృధా అయిపోయింది. గాంధీగారు జైలుకువెళ్ళిన కారణంగా, కార్యనిర్వాహక వర్గీయులలో ఉత్పన్నమయిన పరిస్థితులు ఇలా పరిణమించాయి. అనుకున్న ప్రకారం బాదితుల కా సహాయం చేయలేక పోయాము. నిజానికి యీ కారణంగా కార్యనిర్వాహక వర్గంనుండి తప్పుకోవాలని తలచాను. కాని, రాజగోపాలాచారిగారు తాము చేస్తున్న తప్పును గ్రహించగలుగుతారనీ, దనాన్ని యిచ్చి తీర్తారనీ, తిరిగీ మన కాంగ్రెసు మర్యాద కాపాడగలుగుతామనీ తలుస్తూ కార్యనిర్వాహక వర్గంలో ఉండిపోయాను. వీలయినప్పుడల్లా రాజగోపాలాచారిగారిని హెచ్చరిస్తూ ఎన్ని తంటాలుపడ్డా రాజాజిగారి కుందేటికి మూడే