పుట:Naajeevitayatrat021599mbp.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను చలించలేదు. మాష్టరు దగ్గిరికి నా మీద రిపోర్టు వెళ్ళింది. ఆయన నన్ను తన బల్లదగ్గిరికి పిలిచారు. ఆ బల్లమీద ఇంకా ఎందరో మాజీ జడ్జీలు మొదలయినవారు ఉన్నారు. నేను "నా కీ ఆచారం ఇష్టంలేదు. ఇష్టం కానిపని చెయ్యకుండా ఉండడానికి నాకు స్వాతంత్ర్యం లేదా?" అని అడిగాను. ఆయన ఒక్క క్షణం నా ముఖంకేసి నవ్వుతూ చూసి "సరే! నీ బల్లదగ్గిరికి వెళ్ళ" మన్నాడు. ఈ రీతిగా నేను ఇంగ్లీషు ఇన్‌లోని పొగతాగే ఆచారం ధిక్కరించాను. అయితే, అ తరవాత నేనుకూడా సిగరెట్టు అలవాటు చేసుకున్నాను.

నేను మొదటిసారి అక్కడ ఉన్న ఎనిమిది మాసాలలోనూ ఇంగ్లండులోని ముఖ్య పట్టణా లన్నీ చూశాను. అక్కడ ఉన్న యూనివర్సిటీలు కూడా చూశాను. బారిష్టరు పట్టాతోబాటు ఆర్టుడిగ్రీ కూడా పొందాలని నా సంకల్పం. అందుకుకూడా చదువు ప్రారంభించాను. కాని ఇన్ని చదువులవల్ల అసలు గ్రంథానికి అభ్యంతరం కలుగుతుందని విరమించాను. షేక్సుఫియరు మహాకవి ఇల్లు, ఆయన భార్య నివాసము మొదలైన చారిత్రక స్థలాలు ఎన్నో దర్శించాను. వాళ్ళ దేశంలోని ప్రసిద్ధ రచయితలకి వాళ్ళు చూపే ఆదరణమూ, గౌరవమూ చాలా ప్రశంసనీయాలు. ప్రభుత్వమే వాళ్ళు ఉండే ఇళ్ళు వగైరాలు కొని, వాటిని, జాతీయ ప్రతిష్ఠాపనలుగా రక్షించి ఉంచుతారు.

మనదేశంలో, ముఖ్యంగా తెలుగుదేశంలో భారతం వ్రాసిన నన్నయాదులకీ, భాగవతం వ్రాసిన పోతన్నకీ వాళ్ళ గ్రంథాలు తప్ప వారి సంతతి వారికి ఉత్సాహం కలిగించి గర్వం కలిగించే చిహ్నా లేమీ లేనేలేవుకదా! అప్పుడే ఎప్పటికైనా రాజమహేంద్రవరంలో తిక్కనకీ, నన్నయకీ, ఎఱ్ఱన్నకీ ఒక స్మారకచిహ్నం కట్టాలని నాకు సంకల్పం కలిగింది. కాని, తరవాత జీవితపు ఆందోళనలో నే నా పని చెయ్యలేక పోయాను.

నేను లండన్‌లో ఉన్న మొదటి మూడు నెలలూ కూడా రాజమహేంద్రవరం మునిసిపల్ ఛైర్మన్‌గానే ఉన్నాను. కాని, అ తరవాత నా ఛైర్మన్ పదవికి లండన్‌నించే రాజీనామా ఇస్తూ మద్రాసు గవర్న