పుట:Naa Kalam - Naa Galam.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆహ్వానించారు.

నేను రక్తదానం, నేత్ర దానాల ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగిస్తుండగా, శ్రీ చంద్రబాబునాయుడు, శ్రీ చిరంజీవి తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నేను శ్రీ చంద్రబాబును గురించి సభలో ప్రసంగిస్తున్నాను. నా కొక అలవాటు వుంది. వేదికపై వున్న వారిలో నేను ఎవరిని గురించి మాట్లాడుతున్నానో వారే నా మాటలు వినకపోతే, నేను - వారిని వుద్దేశించి, "నేను మాట్లాడేది మిమ్మల్ని గురించే, మీరే వినకపోతే ఎలా?" అని వారి దృష్టిని వినమ్రంగానే ఆకర్షిస్తాను. ఆ రోజు కూడా అలాగే ముఖ్యమంత్రిని, మెగాస్టార్‌ను నా వైపు తిప్పుకున్నాను!

సభ ముగిసిన తరువాత చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ లేబరేటరీని నాకు చూపించారు. ఇద్దరం కూర్చుని మాట్లాడుతుండగా, శ్రీ చిరంజీవే చంద్రబాబుతో తన సంభాషణ తీసుకువచ్చారు.

"మరేమీ లేదు. మీరు ఈ రోజు (అక్టోబర్‌ 2) మహాత్మాగాంధి జయంతి మాత్రమే కాక, మరో మహామహుని జయంతి కూడ. ఆయన పేరు చెప్పండి!" అంటూ సభికులపై ప్రశ్నాస్త్రం సంధించారు. ఆ లక్ష మంది ప్రేక్షకులలో ఎవ్వరూ చెప్పలేకపోయారు! మీరు వెంటనే "మన ద్వితీయ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి" అన్నారు.

వెంటనే శ్రీ చంద్రబాబు "ఇదేమిటి? లాల్‌ బహదూర్‌ జయంతి కూడ ఈ రోజేనని ఈయన అంటున్నాడు. వాస్తవమేనా?" అని నన్ను ప్రశ్నించారు.

"మీరు ముఖ్యమంత్రి, గొప్ప రాజకీయ వేత్త. ఈ రోజు లాల్‌ బహదూర్‌ జయంతి అవునో, కాదో మీకు తెలియనిదే సినీ నటుణ్ణి నాకేమి తెలుస్తుంది?" అన్నాను. మా సంభాషణ అంతకంటె మరేమీ లేదు. దానికే మీరు మమ్మల్ని