పుట:Naa Kalam - Naa Galam.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీరు చేతితో భోజనం చేస్తూ చెవులు మాత్రం నాకివ్వండి" అని సన్మానపత్రం ఆ సాంతం చదివినట్టు నటించి, శ్రీ గోపాలరెడ్డి ద్వారా శ్రీ నాగేశ్వరరావుకు సమర్పించాము.

ఇదీ అక్కినేనికి "నటసామ్రాట్‌" బిరుదు ప్రదానగాథ. ఆ బిరుదు "ప్రసవం" అన్ని అవాంతరాల మధ్యా జరిగింది! అయితే నేమి, "నట సామ్రాట్‌" అంటే నాగేశ్వరరావు, నాగేశ్వరరావు అంటే "నట సామ్రాట్‌" - రెండూ పర్యాయ పదాలైపోయినాయి!

శ్రీ అక్కినేని రెండు, మూడు సభలలో ఏమన్నారంటే, "ఆరోజులలో సినీ నటులకు పిల్ల నివ్వడానికి చాలా మంది ముందుకు వచ్చే వారు కాదు. సినిమాలలో వేషాలు వేసే వారికి అప్పటిలో ఇప్పటి అంతగా "గ్లామర్‌", విలువ వుండేవి కావు. అలాంటి పరిస్థితులలో ఈ "నటసామ్రాట్‌" బిరుదు సినీనటుల విలువను పెంచింది. సినీ కళాకారులు కూడా గౌరవనీయులు అన్న భావన విస్తరించింది". అన్నారు.

శ్రీ అక్కినేనికి "పద్మభూషణ్‌" అవార్డు వచ్చినప్పుడు విజయవాడలో పెద్ద ఎత్తున సన్మానం జరిగింది. "ఈ పద్మభూషణ్‌" కంటె నాకు ఎప్పుడో ఈ విజయవాడ ప్రజలు ప్రదానం చేసిన "నట సామ్రాట్‌" బిరుదుకే నా దృష్టిలో విలువ ఎక్కువ" అని ఆ సభలో అక్కినేని అన్నారు. ఢిల్లీలో శ్రీ అక్కినేని పాల్గొన్న ఒక సభలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి "నట సామ్రాట్‌" బిరుదును గురించి ప్రస్తావించారు. బహుశా ఏ నటునికి వున్న బిరుదైనా, నాగేశ్వరరావుకు "నట సామ్రాట్‌"వలె వారి పేరులో భాగం కాలేదు!

ఆ బిరుదుకు శ్రీ అక్కినేని ఎంత విలువ ఇచ్చారంటే, ఆయనకు ఆ బిరుదు ప్రదానం జరిగి 2007 ఆగస్టుకు 50 సంవత్సరాలు పూర్తి అయినాయి. అంటే "నటసామ్రాట్‌" బిరుదుకు అది స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సందర్భంగా