పుట:Naa Kalam - Naa Galam.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన కారులోనే కూర్చుని, "నేనిప్పుడు అర్జంటుగా మద్రాసు వెడుతున్నాను. పొట్టి శ్రీరాములు గారి పరిస్థితి విషమంగా వుందట" అన్నారు.

"ఔనండీ! ఆ సమస్యపైనే మేము అన్ని పార్టీలు కలిసి హర్తాళ్‌ చేస్తున్నాము. మీరు దయచేసి, కిందకు దిగి, ఇక్కడ వున్న అన్ని పార్టీల సభ్యులను వుద్దేశించి, రెండు మాటలు చెబితే సంతోషిస్తాము" అన్నాను.

ఆయన నెమ్మదిగా కారు దిగి వచ్చారు. ప్రక్కనే వున్న పందిరి కింద అప్పటికప్పుడు రెండు, మూడు కుర్చీలు వేశాము. కమ్యూనిస్టు సభ్యుడొకరు నా పేరు సభకు అధ్యక్షుడుగా ప్రతిపాదించారు. నేను ఎక్కువ మాట్లాకుండా ప్రకాశంగారిని సందేశమివ్వవలసిందిగా కోరాను. ఆయన కూర్చుని మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారి నిరాహారవ్రత వుద్దేశాన్ని వివరించారు. ఆయన పరిస్థితి ఎలా వుంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఇలా అన్నారు.

"కుటుంబరావు పత్రికా నిర్వహణలో దిట్ట. సభా నిర్వహణలో దక్షుడు. జంకూ గొంకూ లేకుండ మాట్లాడే ఉపన్యాసకుడు" అని నన్ను ప్రశంసించం నా జీవితంలో మరపురాని సన్నివేశం. అప్పటికే "తెలుగు స్వతంత్ర"లోను, "ప్రతిభ" పత్రికలోను నేను ఆయనను గురించి వ్రాసిన వ్యాసాలను చదివినట్టు నాకు కొందరు ప్రముఖులు చెప్పారు. 1951 ఏప్రిల్‌ 27వ తేదీన విజయవాడలో ఆయన స్థాపించిన ప్రజాపార్టీ ఆవిర్భావ సభలో నా ఉపన్యాసాలు విన్నారు. ఆనాడు ఆయన అన్నమాటలను నా మానస పేటికలో భద్రంగా దాచుకున్నాను. ఆ తరువాత ఆయన కారులో విజయవాడ మీదుగా మద్రాసు వెళ్లారు.

అసెంబ్లీకి పోటీ!

1952లో నవ భారత రాజ్యాంగం ప్రకారం మద్రాసు శాసనసభకు