పుట:Naa Kalam - Naa Galam.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతుడైన జాతీయ వాది శ్రీ కుటుంబరావు. రాజకీయ వేత్తలపైన, ప్రజా సమస్యలపైన ఆయన వ్రాసిన గ్రంథాలు బహుళ ప్రచారం పొందాయి. ఆయన ఉత్తమ మిత్రుడు. సమకాలిక సంఘటనలను ఆయన తన మేధాశక్తితో నిశితంగా పరిశీలిస్తారు. ఆయనతో మాట్లాడ్డం, ప్రముఖులను గురించి, ప్రజా సమస్యలను గురించి ఆయన ద్వారా తెలుసుకోవడం ఆహ్లాదకరంగా వుంటుంది".

- డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి
ఉత్తర ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌

"నేను ఏదైనా ఒక సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తూ వుండగానే దానికి వెంటనే ఒక పరిష్కార మార్గాన్ని శ్రీ తుర్లపాటి లేఖ ద్వారా సూచించేవారు.

ప్రభుత్వ వ్యవహారాల పట్ల, ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యల పట్ల ఆయనకున్న ఆసక్తి ఎందరికో వుండదు. ఆయన భాషా చాతుర్యంతోను, అపారమైన రాజకీయ పరిజ్ఞానం వల్లను, వాగ్ధాటివల్లను పార్లమెంటేరియన్‌గా ఎంతగానో రాణించగలరు."

- డాక్టర్ చెన్నారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి

"ఉత్తమ అనువాదకుడు"

- శ్రీ మొరార్జీ దేశాయ్
ఇండియా మాజీ ప్రధాని

"సాహిత్య, సాంస్కృతిక, చలన చిత్ర, పత్రికా రచన రంగాలకు ఆయన ఎనలేని సేవ చేశారు. విజయవాడలో ఆయన లేకుండా ఏ సభ కాని, సమావేశం కాని సాధారణంగా జరగవంటే అత్యుక్తి కాదు."

- డాక్టర్ కె.ఎల్‌.రావు
కేంద్రప్రభుత్వ మాజీ మంత్రి