పుట:Naa Kalam - Naa Galam.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నేటి రాజకీయ వేత్త లెందరికో తెలియని విషయాలను వారికి తెలియజేస్తూ, రాజకీయ పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తున్న రాజకీయ జర్నలిస్టు శ్రీ తుర్లపాటి. మా వంటి రాజకీయ వేత్తలు ఆయనకు ఎంతో ఋణపడి వున్నారు"

- శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి
కాంగ్రెసు మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి

"ప్రజాసేవారంగంలో వుంటే మాకంటే ఎక్కువగా రాణిస్తారు శ్రీ తుర్లపాటి."

- శ్రీ కె. రోశయ్య,
రాష్ట్ర ముఖ్యమంత్రి

"ప్రఖ్యాతి పొందిన అనేక పత్రికా రచయితలకు తెలుగుదేశం జన్మనిచ్చింది. శ్రీ కుటుంబరావు తెలుగు పత్రికారచయితలలో తమ కొక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. మంచి రచయితగానే కాక, గొప్ప వక్తగా కూడా పేరు పొందారు. సభావేదిక ఎక్కితే, ఎంతటి ఉద్దండులైన ఉపన్యాసకులకైనా అచ్చెరువు కలిగించేటట్టు ఉపన్యసించగల వాక్చతురుడు. ఉపన్యాసాన్ని ఎత్తుకొనడంలోను, ముగించడంలోను తుర్లపాటికి తుర్లపాటే సాటి."

- శ్రీ జలగం వెంగళరావు
మాజీ ముఖ్యమంత్రి

"ప్రముఖ జర్నలిస్టుగా, ప్రసిద్ధ ఉపన్యాసకుడుగా, చరిత్రకారుడుగా శ్రీ తుర్లపాటి నాకు నలభై సంవత్సరాలుగా తెలుసు. అలాంటి ప్రత్యేకత కొద్ది మందికే లభిస్తుంది"

- శ్రీ ఎమ్‌.ఆర్‌. అప్పారావ్‌
ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌