పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

మీఁగడ తఱకలు


లుదాహృతము లయియున్నవి. సాహిణిమారన, చాళుక్యచొక్కభూపతి, సాగిపోతరాజు, (అనంతవర్మ) కళింగగంగదేవుడు, చోడగంగడు, మైలమభీమడు, నల్లసిద్ధి, లేటివరపుపోతరాజు, రణతిక్కన యనువారి మీఁద నీతఁడు చాటుపద్యములఁ జెప్పినాడు. ఇందుఁగొన్ని కల్పితములును గావచ్చును. పైవారిలో మైలమభీమనికే ఏఱువభీమఁ డని, చిక్కభీమఁ డని నామాంతరములు. ఈతనిపై భీమకవి ప్రశస్తమయిన ప్రశంసా పద్యములు చెప్పినాడు. అవి యెల్ల చాటుపద్యమణిమంజరిలోఁ జూడనగును. మచ్చునకు రెండుపద్యములు.

క|| అరినరు లేఱువభీమని
     పొరువున మనలేరు చిచ్చుపొంతను వెన్నై
     తెరువునఁ బెసరై జూదరి
     సిరియై రేన్చెట్టుక్రింద జిల్లెడుచెట్టై. ||

ఉ|| యాచక ఖేచరుండు సుగుణాంబుధి మైలమభీమఁ డీల్గినన్
     జూచి వరించె రంభ, యెడఁజొచ్చెఁ దిలోత్తమ, దారి నిద్దఱన్
     దోచె ఘృతాచి, ముగ్గుఱకు దొడ్డడికయ్యము పుట్టె, నంతలో
     నాcచుకుపోయె ముక్తిసతి, నవ్విరి యద్దశఁ జూచి నిర్జరుల్
     నోఁచినవారి సొమ్ము లవి నోమనివారికి వచ్చునే ధరన్||

ఈపద్యపుఁ దుదిచరణము గలపద్యము నాచనసోమనాథుని యుత్తరహరివంశమునను గలదు.

ఉ|| ఏఁచు నుపేంద్రునిం బదక మిమ్మని రుక్మిణి మున్ను దేవుఁడుం
     బూఁచినపూవు దప్పుటకుఁ బోకులఁబోవుచు నుండు నిమ్మెయిన్
     డాఁచినసొమ్ము చేరె నిచటన్ మదిఁ గోరనిసత్యభామకున్
     నోఁచినవారిసొమ్ము లవి నోమనివారికి వచ్చునే ధరన్?
                                         -ఉ.హ. 168, ప్రథమాశ్వాసము.

భీమకవిచాటుపద్యముల పోలికపద్యములు నాచనసామనాథుని యుత్తరహరివంశమున నింకను కలవు. భారతిలో శ్రీనేలటూరి