పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

31


వృద్ధపారంపర్యమున నీపద్య మీవిధముగా వినికిడి కలదుగాని ప్రాత వ్రాఁతలలో 'తెలుంగాధీశ' యని కాక 'కళింగాధీశ' యని పాఠము కానవచ్చుచున్నది. మనభీమకవి కళింగాధీశుఁ డయిన యనంతవర్మ చోడగంగదేవుని దర్శించినట్లింకను గొన్ని చాటుపద్యములు చాటుచున్నవి గాన యీపద్యమున 'కళింగాధీశ' యను పాఠమే పరిగ్రాహ్య మనవచ్చును.

పయిపద్యమున భీమకవి 'విషామృతము' మొదలగు గ్రంథముల రచించి నట్లున్నది. కాని యాగ్రంథము లేవియు నిప్పుడు కానరాకుండుట శోచనీయము. 'విషామృత'మని జ్యోతిషగ్రంథ మొకటి కలదుగాని యది యితనిదై యుండదు. ప్రసిద్ధమైన కవిజనాశ్రయ మీభీమకవి రచించినదిగా లోకప్రతీతి. గ్రంథమున 'రేచన' రచించిన ట్లున్నది. ఆతఁడు కోమటియఁట. అనంతవర్మ చోడగంగదేవుని సంధివిగ్రహి 'రేచన' యొకడు కలడు. అతనిశాసనము గోదావరీమండల దాక్షారామభీమేశ్వరస్వామి యాలయములో నున్నది. మనభీమకవి యా రేచనపేర కవిజనాశ్రయము రచించియుండు నేమో! కవిజనాశ్రయ మిప్పుడు చాల అపపాఠములతో, ప్రక్షిప్తగ్రంథములతో నిండియున్నది. దానిని జాగ్రత్తగా సంస్కరించి యుద్ధరింపవలసియున్నది. చిత్రపుభీమన యనుకవి రచించినఛందస్సు 'ఉత్తమగండచ్ఛందస్సు' అను పేరిది వేఱొకటి గలదు. అదియు కవిజనాశ్రయము నొకటే యని కొందఱు భ్రమపడిరి. అది యట్లు గాదు. ఉత్తమగండచ్ఛందస్సు వేఱు. కవిజనాశ్రయము వేఱు. ఉత్తమగండచ్ఛందస్సు చిత్రపుభీమన రచించినది. కవిజనాశ్రయచ్ఛందస్సు వేములవాడభీమకవిరచించిన దని ప్రతీతి గలది. రెండును బ్రాచీనతరచ్ఛందోగ్రంథములే! వేములవాడభీమకవిగ్రంథము లేవియు దొరకకపోయినను లక్షణగ్రంథాదులం దాతని చాటుపద్యము లుదాహృతములై చాల దొరకుచున్నవి. మఱిన్నీఆంధ్రప్రయోగరత్నాకరమున వేములవాడ భీమకవికృతి నృసింహపురాణ మనుపేరితో కొన్నిపద్యము