పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

25


పండితారాధ్యుని గ్రంథములు

శివతత్త్వసారము, శతకము, రుద్రమహిమ, భీమేశ్వరగద్యము, లింగోద్భవదేవగద్యము, స్తుతిశ్లోకపంచకము, అమరేశ్వరాష్టకము, పర్వతవర్ణన అన్న గ్రంథములు పండితారాధ్య రచితములుగా సోమనాథుఁడు పేర్కొన్నాఁడు. ఇందు భీమేశ్వరగద్యము 'యత్సంవిత్తి' అని యారంభ శ్లోకముగలదిగాను, స్తుతిశ్లోకపంచకము తస్మై నమ శ్రీగిరివల్లభాయ' అని మకుటముగలదిగాను సోమనాథుఁడే పేర్కొన్నాఁడు. పైగ్రంథములలో శివతత్త్వసారము, శతకము = తెల్గుగ్రంథములు. తక్కిన వెల్ల సంస్కృతగ్రంథములే కాఁబోలును. ఇవిగాక, సంసారమాయాస్తవము, శంకరగీతము లని పదములు, ఆనందగీతము లని పదములుకూడ మల్లికార్జునపండితారాధ్యరచితము లనుకొనఁదగినట్లు సోమనాథుఁడు పేర్కొన్నాఁడు. ఈగ్రంథములు గాక మద్రాసుప్రాచ్యలిఖితపుస్తకశాలలో మల్లికార్జున పండితారాధ్య కృతి 'శ్రీముఖదర్శనగద్య' మని సంస్కృత గ్రంథ మొకటి గలదు. బసవపురాణ పీఠికలో దాని నేను వెల్లడించితిని. ఆరాధ్యదేవరమల్లికార్జునశతకము లోనిదిగా నీక్రిందిపద్యము లక్షణ గ్రంథములందుం గలదు.

ఉ|| లోకములెల్ల నీతనువులోనివ, నీవట యెంత కల్గుదో
      నాకపపద్మసంభవ జనార్ధను లాదిగ నెల్లపెద్దలున్
      నీకొలఁ దింతయంత యన నేరక మ్రొక్కఁ దొడంగి రన్న ని
      న్నేకరణిన్ నుతింతుఁ బరమేశ్వర!శ్రీగిరి మల్లికార్జునా!

సోమనాథుఁడు పేర్కొన్న శతక మీశ్రీగిరి మల్లికార్జునశతకము గాcబోలును. ఇది సమగ్రముగా దొరకవలసియున్నది. సోమనాథుఁడు తన పండితారాధ్యచరిత్రమునఁ జాలగాఁ దనద్విపదకృతిలోనికి మార్చుకొన్నది, ఆంధ్రకందపద్యాత్మకము తిక్కనసోమయాజులవారి కింకను నూఱేండ్ల ప్రాఁతకాలపు దగుటచే భాషాచరిత్రాదిపరిశీలకుల కత్యంతోపకారము, తత్కాలపు టాంధ్రదేశపు టారాధ్యశైవమతసంప్రదాయనిరూపకము