పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/180

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

161


తొల్లిటివాఁ డిది యంతయు మాయయని నే నన్నట్టే యయ్యె ననెను. కడమవారుకూడ వారు తొలుత ననుకొన్నట్లే యనుకొనిరి గాఁబోలును! భక్తుని తర్వాతి తీ రెట్లుండఁబోలునో మీరే పర్యాలోచించి నిర్ణయించు కొందురుగాక! ఈకథనో, ఆచెట్టునో కడుపునఁ బెట్టుకొని త్యాగరాజుగా రీపాట పాడిరి!

తరము గాని యెండవేళా కల్ప
           తరునీడ దొరకిన ట్టాయె యీ వేళ
నన్ను విడిచి కదలకురా, రామ!
           ని న్నెడబాసి యరనిమిష మోర్వనురా!
           నన్ను విడిచి కదలకురా !

త్యాగరాజుగారి కీర్తన లన్నియు లోఁతు తఱచి చూచినచో నిట్టి యనుభవముల నాదబ్రహ్మావతారములే!

★ ★ ★