పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

157

బండుదుండగము లాడువాఁడు “పలుకు తేనెలతల్లి" పాటలఁ బాడఁజాలడు. కట్టెలు గొట్టువాఁడు వీణ మీఁటజాలఁడు. సంగీతము సుకుమారకళ ఇది భక్తిజ్ఞానపర మగుచో సుకుమారాతిసుకుమారము, మధురాతిమధురము నయిన యాత్మానుభూతికిఁ ద్రోవత్రొక్కించు ననుట మీయనుభవము. శ్రుతిస్థాయి తప్పనిగానము నేర్చినట్టే మీరు భగవత్పరమే యయినరచననుగూడ నేర్చితిరి. మీ గేయరచనాగానవిధానములు మానవలోకోద్ధారకములు. దివ్యప్రజ్ఞాస్ఫోరకములు.

భగవంతుని కభిముఖముగా మనజీవయాత్ర సాగించుచు నాయనతో నన్వయము చెందునట్లు చేయుట గానమునకుఁ బరమార్ధము. ఈ జీవశ్రుతిస్థాయిని సదా హృదయమునఁ గుదుర్చుకొని మనము గానానందము ననుభవింతము గాక!

ఈ యర్ధమునకుఁ దార్కాణగా త్యాగరాజప్రసక్తమగు నొకకథ నిక్కడ వివరింతును.

త్యాగరాజుగారి తాతలకాలమునఁ దెల్లుదేశమున భయంకరక్షామ పీడ కల్గె నఁట. ఒకపల్లెటూర వీరితాతలతాతగారు భగవత్సంకీర్తనము జరుపుకొనుచుఁ బలువుర నాకట్టుకొని పూజ్యలుగా నుండెడివారఁట! ఆయన యాయూర నాహారపదార్ధములఁ గొంద ఱిండ్లనున్నవాని నందఱకుఁ బంచి పెట్టించి, నేఁటి రేషన్ విధానమునఁ గొన్నాళ్లు తక్కువతిండితో నూరివారిప్రాణములు నిలిపెనఁట. ఏయింటను జిట్టెడుగింజలుకూడ లేని దుస్పితి వచ్చెను. ఎండలు మండుచున్నవి. మరణయాతన వచ్చినది. ఈ ముసలిబాపఁ డీశ్వరుఁ డున్నాడు, రక్షించును అని సంకీర్తనము చేయుచుండెను. ఆయూరి కైదాఱుమైళ్ల దూరమున. నీరు లేని యిసుకయెడారియేఱును, దాని కావలిగట్టున నొకగ్రామమును, నాయూరి రెడ్డియింటఁ జాల నిలువధాన్యమును నుండుట విన వచ్చెను. వానలు లేకున్నను నాయేటిచలువకు బావులలో నీళ్లుండుటచే నాయూరఁ