పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిశుభాశయము

భూమన్,

సంచాలకులు,

ఎస్.వి. ఉద్యోగుల శిక్షణ కేంద్రము,

ఎస్.వి. కేంద్రగ్రంథాలయము & పరిశోధన సంస్థ,

శ్రీవేటూరిప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠము,

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు,

శ్వేత భవనము, తి.తి.దేవస్థానములు, తిరుపతి.

తిరుమల తిరుపతి దేవస్థానం గొప్పధార్మికసంస్థ. సాహిత్యం, భక్తిసంగీతం, ఆధ్యాత్మికం, ధార్మికప్రచారం, కల్యాణమస్తు, శాంతియాగాలు, దళితగోవిందం, అర్చకపునశ్చరణ తరగతులు - ఇలా ఎన్నో విధాలుగా ప్రచారసేవలు అందిస్తూ, సమాజాన్ని ధార్మికచింతనమార్గంలోకి తేవడానికి అహర్నిశలూ కృషి చేస్తూంది. ఎంతచేసినా ఇంకా చేయాల్సింది ఎంతో వుందనే తోస్తూంది.

ఈ శుభాశయంతో ఇటీవల క్రొత్తగా "శ్రీవేటూరిప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠాన్ని "శ్వేత" లో స్థాపించడం జరిగింది. ప్రభాకరశాస్త్రిగారు సుప్రసిద్ధకవిపండితులు. గొప్పవిమర్శకులు. నిరంతరసాహితీపరిశోధకులు. తిరుమల తిరుపతి దేవస్థానంతో శాస్త్రిగారికి ఎంతో అనుబంధం ఉంది.

పీఠాన్ని స్థాపించకమునుపే వేటూరివారివర్ధంతిని నిర్వహించటం జరిగింది. పీఠాన్ని స్థాపించిన వెంటనే శ్రీశాస్త్రిగారి 120వ జయంతి రావడం, ఈ సందర్భంగా శాస్త్రిగారి అలభ్య పుస్తకాలను నాల్గింటిని "సింహావలోకనం, ప్రజ్ఞాప్రభాకరం, తెలుగుమెఱుగులు, మీగడతఱకలు" పునర్ముద్రించి, సాహితీప్రియులకు అందించడం ఆనందంగా ఉంది.

శ్రీశాస్త్రిగారి 120 వ జయంతి సందర్భాన 'శ్వేత' భవనం ఎదురుగా - వారి కాంస్యవిగ్రహాన్ని స్థాపించడమూ గొప్పస్ఫూర్తిదాయకం! శ్రీశాస్త్రిగారి అలభ్య, అముద్రితరచనలను ముద్రించడం, వారి సాహిత్యంపై పరిశోధనలు గావించడం, వారు వ్యాఖ్యానించిన “ఉత్తర హరివంశాన్ని" (అసమగ్రం) సుప్రసిద్ధపండితులతో పూర్తి చేయించడం, మున్నగు కార్యక్రమాలతో పీఠం నానాటికీ విస్తృత మవుతుం దని ఆకాంక్ష