పుట:Matamu-Pathamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేని వానిని తెలుసుకోవాలంటే నీవు నీ పేరునూ, కులమునూ, మతమునూ దేవుని విషయములో దూరముగా పెట్టుకో.

24. నీవు ఏ మతాన్ని సమర్థించవద్దు. దేవున్ని, దేవుని జ్ఞానాన్ని మాత్రము సమర్థించు.

25. నీ ఇష్టముతో కూడుకొన్నది మతము. దేవుని ఇష్టముతో కూడుకొన్నది జ్ఞానము.

26. మతమును మనిషి సృష్ఠించాడు. జ్ఞానమును దేవుడు సృష్ఠించాడు.

27. మనిషి సృష్ఠించిన మతము ఇహమునకు సంబంధించినది. దేవుడు సృష్టించిన జ్ఞానము పరమునకు సంబంధించినది.

28. మనిషి సృష్ఠించిన మతమును పట్టుకొని ఇహములో ఉంటావో, దేవుడు సృష్ఠించిన జ్ఞానమును పట్టుకొని పరమునకు పోతావో నీవే నిర్ణయించుకో.

29. మతము మనుషుల గుంపును పెంచుతుంది. జ్ఞానము కేవలము జ్ఞానుల గుంపును పెంచుతుంది.

30. మతాన్ని ఏ మనిషిలోనైనా చూడవచ్చును. జ్ఞానాన్ని కొందరిలోనే చూడవచ్చును.

31. ప్రతి మనిషి మతానికి సంబంధించినవాడే. కానీ ప్రతి మనిషి జ్ఞానానికి సంబంధించి ఉండడు.