పుట:Matamu-Pathamu.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

32. మతాన్ని బోధించేవారు మతగురువులు ఎందరో! జ్ఞాన్నాన్ని బోధించేవాడు జ్ఞానగురువు ఒక్కడే!!

33. మతము మనిషి పుట్టుకతోనే ఉంటుంది. ఇది నా మతము అని అందరికి తెలుసు. కానీ దైవజ్ఞానము పుట్టుకతో ఉండదు. మధ్యలో జ్ఞానము తెలిసినా అది అందరికి నచ్చదు.

34. మతము అంటే మార్గముకానిదని అనుభవముతోనే తెలుస్తుంది.

35. పథము అంటే మార్గము అయినదని అర్థములోనే తెలుస్తుంది.

36. ఒక మతములోని అజ్ఞాని కూడ ఇది నా మతము అని చెప్పగలుగు చున్నాడు. అందువలన మతములో అందరూ జ్ఞానులుంటారను నమ్మకము లేదు.

37. అజ్ఞానులు సహితమున్న మతముకావాలో కేవలము జ్ఞానులున్న పథముకావాలో నీవే యోచించుకో.

38. ఏ మతములోని అజ్ఞానమునైనా ఖండించు, ఏ మతములోని జ్ఞానమునైనా స్వీకరించు.

39. నీవు నాది హిందూమతమని అనుకుంటే ఇతరమతములోని జ్ఞానాన్ని కూడ ద్వేషిస్తావు. నాది ఇందూపథమని అనుకుంటే ఇతరమతము లోని అజ్ఞానాన్ని మాత్రమే ద్వేషించి జ్ఞానాన్ని ప్రశంసిస్తావు.

40. హిందూమతము పేరుతో రాజకీయమును చేయువారికి దూరముగా ఉండు. ఇందూపథము పేరుతో రాజయోగము చెప్పువారికి దగ్గరగా ఉండు.