పుట:Matamu-Pathamu.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయముల సంఖ్య మరియు శ్లోకముల సంఖ్యయున్నా, అది గొప్పగా కనిపించక నీచముగా కనిపించింది. కర్నూలు జిల్లా మహానంది దగ్గర అతికించిన పోస్టర్స్‌ను గురించి అసభ్యకరమైన పోస్టర్లు అని సంబోధిస్తూ వార్తపత్రికలలో న్యూస్‌ వ్రాయడము జరిగినది. ఆ పని చేసినది ఎవరోకాదు హిందూమతమును రక్షిస్తామని పరిషత్‌లుగా, సంఘములుగా ఏర్పడినవారే అలా చేశారు. అదే పరిషత్‌ వ్యక్తులు కొందరు మేము ఇచ్చిన అడ్రసును పట్టుకొని మా విూద పోలిస్‌స్టేషన్‌లో కేసు కూడ పెట్టడము జరిగినది. హంపిదగ్గరున్న అనేక దేవాలయములలో ఏదో ఒక ఆలయము యొక్క ప్రహరి (కాంపౌండు) గోడవిూద వ్రాశారని వారి ఆరోపణ. ఇది ఏమి పెద్దతప్పుకాదని పోలీసులు చెప్పినప్పటికి, పోలీసులే ఆ వ్రాతను తుడిచివేసినప్పటికి వారి మాటను కూడ వినకుండ పట్టుపట్టి కేసు పెట్టించారు. ఆ విషయమును పోలీసులు మాకు తెలిపితే, మా వారు ఇద్దరు వ్యక్తులు బాగా జ్ఞానము తెలిసినవారు పోయి కోర్టుకు హజరై, వారు అడిగితే వివరము చెప్పాలను కున్నారు. కానీ అక్కడి న్యాయాధిపతి వివరము ఏమి అడగకుండానే ఇరవైరోజులు జైలుశిక్ష చెప్పాడు. దేవుని విషయములో ప్రాణమునైనా సులభముగా ఇవ్వడానికి సంసిద్ధముగా ఉన్న మావారు దేవుని విషయములో ఇది మాయ కలుగజేయు ఆటంకమని, మాకు ఏ బాధలేదని సంతోషముగా జైలుకు పోయారు. మేము వ్రాసిన వ్రాతకు భగవద్గీత అని పేరు పెట్టడము వలన క్రైస్తవులకు బాధకల్గి అసూయతో మావిూద కేసులు పెట్టారంటే వారు మతద్వేషముతో పెట్టారులే అని మనమనుకోవచ్చును. అలా కాకుండా భగవద్గీత అని పేరున్న వ్రాతను చూచి హిందువులే హిందువుల విూద కేసు పెట్టడము పెద్దవింతే అవుతుంది. అదియూ హిందూమతమును ఉద్దరించాలనుకొన్నవారే ఆ విధముగా చేయడము మరీ పెద్దవింతే అవుతుంది.