Jump to content

పుట:Matamu-Pathamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాల్‌పోస్టర్స్‌ను రాష్ట్రమంతటా అంటించడము జరిగినది. అంతేకాక రాష్ట్రవ్యాప్తముగా గోడలవిూద సృష్ఠికర్తకోడ్‌ 963, మాయకోడ్‌ 666 అని వ్రాయించాము. క్రైస్తవులు వ్రాసిన సృష్ఠికర్తకోడ్‌ 666 ప్రక్కనే సృష్ఠికర్తకోడ్‌ 963 అని హైదరాబాద్‌లో అనేక చోట్ల వ్రాయించాము. అలా వ్రాయుట వలన అందరి దృష్ఠి దానివిూద పడి దాని వివరము తెలుసుకొనే ప్రయత్నము చేస్తారని అనుకొన్నాము. మేము గోడలకు అతికించిన పేపర్లవిూద దీని వివరముగల గ్రంథము పలానా చోట దొరుకునని అడ్రసు వ్రాయడము జరిగినది. సృష్ఠికర్త కోడ్‌ 963 అని వ్రాసిన చోట ఇది భగవద్గీతలోని జ్ఞానమని తెలియునట్లు భగవద్గీత అ.15, శ్లోకము 16,17 అని మాయకోడ్‌ 666 వ్రాసిన చోట క్రిందనే భగవద్గీత అ.16, శ్లోకము14 అని కూడ వ్రాశాము. దానిని చూచిన వారికి ఇది భగవద్గీతలోని విషయమని సులభముగా అర్థముకాగలదు.

భగవద్గీతలో ఇంతగొప్ప రహస్యమున్నదని బయటికి ఏ హిందువు గానీ, ఏ హిందూసంస్థగానీ ప్రచారము చేయకున్నను మేము మొట్టమొదటి సారిగా రాష్ట్రవ్యాప్తముగా భగవద్గీత పేరును ప్రచారము చేశాము. అలా చేయుటకు మాకు దాదాపు ఐదులక్షల రూపాయలు అయిపోయినవి. దానికి హిందువులు ఎంతో సంతోషపడాలి. ఒకవేళ బాధకలిగితే క్రైస్తవులకు కలగాలి. అయినా ఇక్కడ మేమనుకున్నాదానికి తలక్రిందులుగా జరిగినది. ఒక విధముగా క్రైస్తవులే సంతోషించారు. ఈయనెవరో ధైర్యముగా సత్యమునే చెప్పాడని ఒప్పుకొన్నారు. బైబిలు ప్రకారము కూడ 666 మాయ నంబరేనని ఈ విషయము భగవద్గీతలో ముందేయుండడము సత్యమునకు బలము చేకూరినట్లేని అనుకొన్నారు. కానీ హిందువులు మేము చేసినపనిని చూచి చాలా బాధపడిపోయారు. గోడలవిూద వ్రాతలలో భగవద్గీత అని ఉన్నా,