పుట:Manu Charitra.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పేర్పడలేదు కావలయు. ఆకాలమున మనదేశమును జాళుక్యులు పాలించుచుండిరి. ఆర్యధర్మము నిర్వక్రముగా సాగింపఁబడుచుండెను. జనులకుఁ బురాణాదిజిజ్ఞాసాయం దాదరము మెండుకొనియుండెను. వారు సంస్కృత భాషాగ్రథితములైన తత్తద్గ్రంథములను 'గాసటబీసటే' చదివి గాథలు ద్రవ్వుచుండిరి. రానురాను దేశభాషకును గొంత రూపేర్పడుచుండఁబోలు. అక్కతన నత్తఱి దేశభాషాకపనమావశ్యకమయ్యెను. అయినాను దానికిఁ దగినసామాగ్రిని గూర్చి కవితను వెలయించు వారవతరింప వలసియుండిరి. ఇట్లు సనఁజన,

క. మును మార్గకవిత లోకం, బున వెలయఁగ దేశికవితఁ బుట్టించి తెనుం గు నిలిపి రంధ్ర విషయమునఁ, జనసత్యాశ్రయునిఁదొట్టి చాళుక్యనృపుల్.

         నన్నెచోళుని కుమారసంభవము-

దాదాపు నేఁటికి వేయిసం|| లకు బూర్వము చాళుక్యాన్వాయభూషణమును సత్యాశ్రయాదిబిరుదాంచితుఁడును రాజ మహేంద్రము రాజధానిగా వేంగీదేశమును బాలించినవాఁడును నగు రాజరాజనరేంద్రుని యాస్థానమునఁ గల సర్వజ్ఞుఁడగు నన్నయభట్టారకుఁడను పండితకవియే మన యాంధ్రభాషలోఁ దోలుతఁ గవిత నవతరింపఁజేసినవాఁడని తలఁపబడుచున్నాఁడు. రాజరాజనరేంద్రునిప్రేరణమున నీతఁడు పంచమవేద మగుభారతమును దెల్గున రచింప దొరఁకొని యరణ్యపర్వములోని కొంత భాగమువఱకును నెఱవేర్చును. ఈతనికవనమున సంస్కృత మర్యాదలు మెండుకొనియుండును. నుడికారముగల తెలుఁగుఁ బలుకుబడులఁ గూర్చుటయం దీతఁడు తక్కువాఁడు కాఁడు.

చ. బహువన పాదపాబ్ధికులపర్వతపూర సరస్సరస్వతీ సహితమహామహీధర మజస్రసహస్రఫణాళిఁ దాల్చిదు