పుట:Manu Charitra.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పీఠిక

ఉ. తల్లి సమస్తభాషలకు దైవతభాషయ; దేశభాషలన్‌ పిల్లలలోన నాంధ్రి యనుపేరిటి దెంతయు ముద్దులాఁడి రా ట్తల్లజు లాదరించినకతంబునఁ బల్కులఁ గుల్కుమీఱి య ల్లల్లన దక్కు నక్కసెలియండ్రకు నెక్కుడుకీర్తి చేకొనెన్.

క. జిలిబిలిపలుకులఁబలుము ద్దులు గులికెడు తెలుఁగుబాసతో సరి యగునే తెలిసియుఁ దెలియక వీనుల నలయించెడు వెఱ్ఱిమొఱ్ఱి యఱమొఱబాసల్.

సంస్కృత మనిపేర్కొనఁబడిన యార్యభాషయే తొలుదొలుత భరతఖండమునఁ బెంపొందినవాజ్ఞ్మవము. చాల వఱకు దానివలననే తార్వతఁ బ్రాకృతములును దేశభాషలలో నాంధ్ర ద్రవిడ కర్ణాటభాషలు ప్రధానమయినవి. ఇందు ద్రవిడ కర్ణాటభాష లాంధ్రమునకంటెఁ బ్రాచీనము లని యూహింపఁబడుచున్నవి. ఆ రెండు భాషలలోను గ్రంథములు రచింపఁబడుచు వచ్చిన కొంతకాలమునకుఁగాని యాంధ్రభాషలో గ్రంథరచనము పక్రమింపఁబడినట్టు చూపట్టదు. గ్రంథరచన ముపక్రమింపఁబడుటకఁబూర్వ మాంధ్ర భాషస్థితి యెట్టిదో మన కించుకయుఁదెలియరాదు. ఇటీవల నాంధ్రకవితకుఁ బుట్టిల్లనఁ జెల్లిన వేంగి దేశమునం దానాఁడు జన్మించిన నాగవర్మ కర్ణాటభాషకు ఛందోంబుధి యను ఛందశ్శాస్త్రగ్రంథమును రచించె; కానీ యాంధ్ర భాషయుబునైన నెత్తఁడయ్యె, నాఁటి కీభాషకుఁ దిన్ననిరూ