పుట:Manooshakti.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

నేనిదివరకుదహరించినపనులను జేయగలవానికి మనోశక్తి కొంతయలవడినదని చెప్పవచ్చును.

ఈతచువ్వలను కలసికొనునట్లుచేయుట.

మనదేశంబున విస్తారముగ నెల్లయెడల నెదుగుచుండెడి యీతచెట్టునుండి రెండుపొడుగుపాటి చువ్వలనుతెచ్చి ఇద్దరు మనుజులను సమానయెత్తుగలవారిని యెదురెదురుగానిలుచుండబెట్టి యీతచువ్వల చివరభాగములను వారిద్దరి చేతులతో (చూపుడువ్రేలితోను బొటనవ్రేలితోను) పట్టుకొనునట్లుజేసి నడుముల కానించునట్లు జేయుము. ఇట్లుజేయునప్పుడు సుమారా యీతచువ్వలకు మధ్య నారేడంగుళములుండును. తరువాత నీదృష్టి నుపయోగించి యీతచువ్వలవంక జూచుచు "ఓ యీతచువ్వలార! మీరొండొంటితో త్వరగాకలిసికొనుడు. అట్లు కలిసికొనుటకై మీకొక విధమయిన శక్తినిచ్చుచున్నాను”, అని నీమనోశక్తినుపయోగించుము. ఇట్లనుకొనుచున్న నిమిష కాలములో యీతచువ్వలు మెల్ల మెల్లగా ప్రాణముగలవానివలె దగ్గిరకువంగి మధ్య ప్రదేశమున నొకదాని కొకటిదాకును ఆహా యెంతటి విపరీతము! యెవరినైన మెస్మరిజమునందు ప్రవేశపెట్టదలచినయెడల నీవిట్టి సులభమగు కార్యములను చేసిచూపించి నేర్చుకొనుటకైవారిని ప్రోత్సాహము చేయుచుండుము.

నిమ్మకాయలను పోట్లాడునట్లు జేయుట.

రెండునిమ్మపండ్లను తెచ్చి వాటిని మెత్తగా నలిపియుంచి