పుట:Manooshakti.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

కనుపించును. బాటసారియొక్క ముఖము గనుపించుచుండిన కనుబొమలమధ్య జూచుచుండిన పైన జెప్పబడిన జ్యోతికనుపించును. అప్పుడు నీమనోశక్తిప్రతాప మాతనిపై నుపయోగించుము. "రమ్ము, నీవుమా ద్దకురమ్ము” అని నీమనసునందనుకొనిన వెంటనే యాబాటసారి మీయందరివద్దకు వచ్చుట జూచి ప్రతివారును మిక్కిలి వింతనొందెదరు. కంటిరా మీ మనసున కెట్టిశక్తి గలిగియున్నదో! నీకు మనోశ క్తి బాగుగ పట్టుపడిన తోడనే నీస్నేహితులయెదుట కొన్నివింత (Wonderful) యగు కార్యములనుజేసి వారిని పలుమారు సంతోషపెట్టగలపు. నేనింకను కొన్ని మిక్కిలియాశ్చర్యములగు వింతపనుల నెట్లుచేయునదియును వ్రాయ నెంచితినిగాని, గ్రంథవిస్తరభీతిచేతను, మరియు కొంతమంది మిత్రులుకూడ నదియే భీతినిజూపిన కారణంబునను కొన్ని స్వల్పపనుల నుదహరించ కుండగమానితిని. అయిన నట్లు మానివేసినపనులను యీగ్రంథమునం నుదహరించినవానినిబట్టి చదువరులే లోపించినవానిని జేసికొందురని మానివేయుట సంభవమాయె. మరియు నీశక్తి వలన మరికొన్ని క్రొత్తవింత లెట్లు చేయునదియును బుద్ధికుశలతచే గనిపెట్టి యెల్లరకును తెల్లంబగునట్లు మెల్లన నీమెస్మరిజపు గ్రంథంబుల నుల్లంబులు రంజిల్లగ వెల్లడింపజేయుటకై కొల్లగ గ్రంథంబులనెల్ల యెడల శీఘ్రముగా నల్లుకొనగ జేయుచు మీవల్లనె యీలోకంబున కొల్లగొన్న ధాన్యమువలె ప్రజలెల్లరు నీశక్తినిసంపాదింప ప్రోత్సాహముజేయ బడుదురని నామనంబున గొప్పయాశయొకటి పొడముచున్నది.