పుట:Manimalikalu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

66.

తను శిధిలం చేసిన నాహృదయాన్ని తడుముకున్నా
తనే తాకిందనుకుని ఆశగా చూసింది మరోసారి

67.

నీ నాలుకతో నా కనుపాపను ముద్దాడావు
కంటిలో నలుసు పడింది అంటూ...దొంగా

68.

ఏదో కోల్పోùయిన భావన
నిన్నా? లేక నన్నా??

69.

శాఖాహారమే తింటాడట
చెట్లుకు కూడ ప్రాణముందని మరిచిపోయాడు

70.

నువ్వే నయం
నీ తలపులు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి నన్ను

71.

చేరుకున్న ప్రతిమజిలీలో ఆశగా చూస్తా నీకోసం

అదేంటో...ఎపుడూ వాస్తవం వెక్కిరిస్తూ కనిపిస్తుంది

72.

ఎన్ని వసంతాలు వర్షించి శిశిరమైపోయాయో
నీకై నా ఎదురు చూపులలో

73.

నావేళ్ళ కొసలు వణుకుతున్నాయి
'నీ ఇష్టప్రకారమే విడిపోదాం' అని నీకు లేఖరాస్తుంటే

74.

నిమిషంలో తిరిగొస్తానంది
యుగాలు కరిగిపోయినా ఆ నిమిషం గడవదే ఇప్పటికీ

75.

నా కవనపు ప్రతీ పదం నీవే
నా గమనపు ప్రతీ పథం నీవే

మణి మాలికలు జ సాయి కామేష్‌ గంటి