పుట:Manimalikalu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56.

'నా'కు 'నీ'కు
మధ్య...'ని'శబ్దం

57.

నా డైరీలో తెల్లకాగితం
లిపిలేని భావాలకి సాక్ష్యంగా

58.

ఏటుచూసినా నీజ్ఞాపకాలే
కనులు మూసినా రెప్పలను కో(తో)సేస్తూ

59.

నా విషాదానికి గణతంత్రం
చెలి 'పరాధీన'గా మారినక్షణం

60.

ఊరవతల శ్మశానం
మద్యకొచ్చింది...కబ్జాలాటలో

61.

నా మౌనం చిరుగుల ప్పటి
నువ్వు నవ్వుతూ ఎదురుగా ఉంటే

62.

అలారం శబ్దం మారిపోయింది.
పసిపాప ఇంటికి వచ్చిందిగా

63.

అద్దంలో బంధించా చందమామని నీకు ఇద్దామని
నీవైపు తిరిగేసరికి బందీగా నువ్వు... నాకోసం

64.

రక్తం... రంగు తెలుపు... నమ్మవా నువ్వు దూరమయ్యాక నాకన్నీటిని చూడు

65.

నిశ్శబ్దమైన యుద్దం నా కనురెప్పలకు నీ తలపులకు...నిదుర విషయంలో

మణి మాలికలు జ సాయి కామేష్‌ గంటి

119