పుట:Mana-Jeevithalu.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
30
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మరొకదానికి సంబంధం లేకుండా ప్రత్యేకమైన స్థానాల్లో బిగించి ఉంచలేము. ఎందువల్లనంటే, అవి నిరంతరం ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతూ ఉంటాయి. కాని, ఎప్పుడూ అంతర్గతంగా ఉన్న తృష్ణ, దాగి ఉన్న వాంఛలూ, ఉద్దేశాలూ శక్తిమంతంగా ఉంటాయి. జీవితం రాజకీయ, ఆర్ధిక కార్యకలాపాల మీదే ఆధారపడినది కాదు. జీవితం అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు - చెట్టు ఆంటే ఆకుగాని, కొమ్మగాని మాత్రమే కానట్లు. జీవితం ఒక సంపూర్ణ ప్రక్రియ. దాని సమైక్యతలోనే ఉంటుంది దాని అందం. పైకి రాజకీయ, ఆర్ధిక వ్యవహారాలతో సమాధానపడినంత మాత్రాన సమైక్యత సిద్ధించదు. ఆ సమైక్యత కారణాలకీ, ఫలితాలకీ అతీతమైనట్టిది.

మనం ఎంతసేపూ కారణాలతోనూ ఫలితాలతోనూ ఆటలాడతాం తప్ప, వాటికి అతీతంగా పోలేము, మాటల్లో తప్ప. మన బ్రతుకులు శూన్యమైనవి, అర్ధరహితమైనవి. అందువల్లనే రాజకీయ ఉద్రేకానికీ, మతాభిమానానికీ బానిసలమైపోయాం. మన జీవితాలను తీర్చిదిద్దే వివిధ ప్రక్రియలన్నీ సమైక్యం కావటంలోనే ఏదైనా ఆశ ఉంటుంది. మత సంబంధమైనది గానీ, రాజకీయమైనది గానీ, మరే సిద్ధాంతాన్ని గానీ అనుసరించి నందువల్ల సమైక్యత సిద్ధించదు. విస్తృతమైన ప్రగాఢమైన ఎరుక, చైతన్యం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ ఎరుక చైతన్యపు లోతుల్లోకి కూడా పోవాలి. ఊరికే పైపై ఫలితాలతో తృప్తిపడితే చాలదు.

12. అనుభవం పొందటం

ఆ లోయ మీద నీడ పడుతోంది. అస్తమిస్తున్న సూర్యుడు దూరాన ఉన్న కొండ శిఖరాలను తాకుతున్నాడు. అ సంధ్యా కాంతి కొండల లోపల నుంచి వస్తున్నట్లుగా కనబడుతోంది. ఆ సుదీర్ఘ మార్గానికి ఉత్తరం వైపు కొండలు బోడిగా, గొడ్డుగా ఉన్నాయి అగ్నిప్రభావానికి గురియై. దక్షిణం వైపు కొండలు పువ్వులు పొదలతో - చెట్లతో నిండి పచ్చగా ఉన్నాయి. సుదీర్ఘమైన, సుందరమైన లోయ మధ్యనుంచి తిన్నగా పోతోంది ఆ మార్గం. ఆ సాయం