పుట:Mana-Jeevithalu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అసత్యాన్ని అసత్యమని గ్రహించటం

311

ఆటంకం కలిగిస్తుంది నిశ్చయంగా. సమస్యకి కారణం తెలుసుకోవటం, సమస్యని అర్థం చేసుకోవటం - రెండూ పూర్తిగా వేరువేరు విషయాలు.

"ఎవరైనా సమస్యని ఏవిధంగా సమీపించగలరు?"

అదే మనం కనుక్కోబోతున్నాం. ఏది అసత్య మార్గమో కనుక్కున్నప్పుడు మనకి తెలిసేది ఒక్కటే అసలైన మార్గం. అసత్యాన్ని అర్థం చేసుకోవటమే సత్యాన్ని కనుగొనటం. అసత్యాన్ని అసత్యంగా గ్రహించటం కఠినం. అసత్యాన్ని పోల్చటం ద్వారా, ఆలోచన యొక్క కొలమానం ద్వారా చూస్తాం. అసత్యాన్ని అసత్యంగా ఆలోచనా ప్రక్రియ ద్వారా చూడటం సాధ్యమేనా? ఆలోచన కూడా ప్రభావితమైనదే కాబట్టి అది కూడా అసత్యమైనదే కాదా?

"ఆలోచన ద్వారా కాకుండా అసత్యం అసత్యమని ఎలా తెలుసుకోగలం?"

ఇదే మనకున్న చిక్కంతా, కాదా? సమస్యని పరిష్కరించటానికి ఆలోచనని ఉపయోగిస్తే దానికి తగినసాధానాన్ని వినియోగించటం లేదు నిశ్చయంగా. ఆలోచన అనేదే గతం నుంచీ, అనుభవం నుంచీ తయారైనది. అనుభవం ఎప్పుడూ గతానికి చెందినదే. అసత్యాన్ని అసత్యంగా గ్రహించటానికి ఆలోచన ఒక గతించిన ప్రక్రియ అని తెలుసుకోవాలి. ఆలోచన ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండదు. దేన్నైనా కనుక్కోవటానికి స్వేచ్ఛ ఉండాలి, ఆలోచన నుంచి విముక్తి కలగాలి.

"మీరనేది, నాకు సరిగ్గా అర్థం కాలేదు."

మీ సమస్యల్లో ఒకటి పొగతాగటం. దాన్ని నిందిస్తూ దాన్ని గురించి సహేతుకంగా నిర్ణయానికొచ్చారు. ఈ పద్ధతి అసత్యమైనది. ఇది అసత్యమైనదని ఎలా కనుక్కుంటారు? నిజంగా ఆలోచన ద్వారా కాదు, అ సమస్యని మీరు ఎలా సమీపిస్తున్నారనే దాన్ని అనాసక్తంగా, జాగ్రత్తగా గమనించాలి. అనాసక్తంగా, జాగ్రత్తగా గమనించటానికి ఆలోచనతో అవసరం ఉండదు. అంతేకాక, ఆలోచన పనిచేస్తున్నట్లయితే, అనాసక్తత ఉండటమే కుదరదు. ఆలోచన పని చేసేది నిందించటానికి గాని, సమర్థించటానికి గాని పోల్చటానికి గాని, అంగీకరించటానికి గాని మాత్రమే. ఈ ప్రక్రియని అనాసక్తంగా,