పుట:Mana-Jeevithalu.pdf/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


56. సొంతం చేసుకోవాలనే తత్వం

ఆయన భార్యని తన వెంట తీసుకువచ్చాడు. అది వారిద్దరికీ సంబంధించిన సమస్య కాబట్టి తీసుకు వచ్చానన్నాడాయన. ఆవిడ కళ్లు కళగా ఉన్నాయి. ఆవిడ పొట్టిగా చురుకుగా ఉంది. వాళ్లు ఎంతో మామూలుగా స్నేహపూర్వకంగా ఉన్నారు. ఆయన ఇంగ్లీషులో బాగానే మాట్లాడుతున్నాడు. ఆవిడ అర్థం చేసుకోగలదంతే. చిన్న చిన్న ప్రశ్నలు అడగగలదు. కొంచెం కష్టమనిపించినప్పుడు ఆవిడ భర్తకేసి తిరుగుతుంది. ఆయన తమ భాషలో అర్థం చెబుతున్నాడు. తమ వివాహం అయి పాతికేళ్లకు పైగా అయిందని చెప్పాడాయన. బోలెడు మంది పిల్లలున్నారట, వాళ్ల కున్న సమస్య ఆ పిల్లలు కాదు. తమ ఇద్దరి మధ్యా ఉన్న తగువేనట. ఆయనకి ఉద్యోగం ఉందనీ, ఏదో తగు మాత్రం వస్తుందనీ చెప్పి, ఈ ప్రపంచంలో బ్రతకటం ఎంత కష్టమో, ముఖ్యంగా సంసారం నడపటం ఎంత కష్టమో చెప్పుకొచ్చాడు. దానికి తను విసుక్కోవటం లేదుట, కాని ఉన్న సంగతది అన్నాడు. భర్తగా తన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తున్నానన్నాడు. అధమం, అలా చేస్తున్నాననే అనుకుంటున్నాడు. అది ఎల్లప్పుడూ అంత సులభమనిపించలేదుట.

అసలు సంగతికి రావటానికి కష్టంగా ఉంది వాళ్లకి. ఎంతో సేపు ఏవేవో మాట్లాడారు - వాళ్ల పిల్లల చదువులూ, కూతుళ్ల పెళ్ళిళ్లూ, శుభకార్యాలకి అయిన వృథా ఖర్చులూ, కుటుంబంలో ఆ మధ్య ఎవరో పోవటం, ఇలా ఎంతో మామూలుగా, హడావిడి లేనట్లుగా ఉన్నారు - ఎందుకంటే, వినేవాళ్లూ, విని అర్థం చేసుకునే వాళ్లూ ఎవరైనా ఉంటే, వాళ్లతో చెప్పుకోవటానికి బావుంటుంది.

ఎదుటి వారి బాధల్ని శ్రద్ధగా వినేదెవరు? మన సమస్యలే మనకి ఎన్నో ఉండగా, ఇక ఇతరులవి కూడా వినటానికి మనకి తీరిక ఎక్కడ? ఎదుటి వారు మీ మాటలు వినాలనుకుంటే డబ్బులైనా ఇవ్వాలి, పూజ అయినా చేయించాలి. వారి నమ్మకమైనా స్వీకరించాలి. వినటమే ఉద్యోగమైన వాళ్లైతే వింటారు కాని, అందులో శాశ్వతమైన విముక్తి ఉండదు. మన మీద ఉన్న భారాన్ని స్వేచ్ఛగా, అనాలోచితంగా తొలగించుకోవాలనుకుంటాం - మళ్లీ తరవాత విచారించేందుకు ఆస్కారం లేకుండా. మీరు మనస్సు విప్పి చెప్పినది, అంటే