పుట:Mana-Jeevithalu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైరుధ్యం

161

ఏర్పడవచ్చు - వ్యక్తంగా కావచ్చు, అవ్యక్తంగా కావచ్చు. ఒకసారి ఏర్పరచుకున్న తరవాత మన చర్యని దాని సమీపానికి తీసుకురావటానికి ప్రయత్నిస్తాం. అదే వైరుధ్యాన్ని సృష్టిస్తుంది. ఏర్పరచుకున్న విధానానికీ, ఆదర్శానికీ అనుగుణంగా ఒకే రీతిలో వర్తించటం అన్నది ముఖ్యం కాదు. అసలు ఆ నిశ్చిత లక్ష్యాన్ని ఎందుకు పోషిస్తున్నామని కనుక్కోవటం ముఖ్యం. ఎందుకంటే, ఆ విధానం లేకపోతే వైరుధ్యమే ఉండదు కనుక. అంచేత మనకి ఆదర్శం నిశ్చితాభిప్రాయం ఉండటం ఎందుకు? ఆదర్శం చర్యకి ప్రతిబంధకం కాదా? చర్యని మార్చటానికీ, అదుపులో పెట్టటానికీ కదా ఆదర్శం బయలుదేరినది? ఆదర్శం లేకుండా వ్యవహరించటం సాధ్యం కాదా? ఆదర్శం గతానికీ, ప్రభావితమవటానికీ ప్రతిక్రియ. అందువల్ల, మనిషిని సంఘర్షణనుంచీ, గందరగోళం నుంచీ అది ఎన్నటికీ విముక్తి కలిగించలేదు. ఆదర్శం, నిశ్చితాభిప్రాయం మనిషికీ మనిషికీ మధ్య విభేదం ఎక్కువ చేసి త్వరలో నాశనం అయేందుకు దోహదం చేస్తుంది.

నిశ్చిత లక్ష్యం ఏదీ లేనట్లయితే, ఆదర్శం లేనట్లయితే, పెడమార్గం పట్టే అవకాశం గాని, వైరుధ్యం గాని ఉండదు. ఒకే రీతిలో ఉండాలనే తపన ఉండదు. అప్పుడిక క్షణక్షణమూ చర్యే ఉంటుంది. అ చర్య ఎప్పుడూ సంపూర్ణంగానూ, నిజమైనదిగానూ ఉంటుంది. సత్యం ఆదర్శం కాదు, కల్పన కాదు, అది వాస్తవమైనది. వాస్తవమైన దాన్ని అర్థం చేసుకోవచ్చు, దానితో వ్యవహరించవచ్చు. వాస్తవాన్ని అర్థం చేసుకోవటం వల్ల శత్రుత్వం పెంపొందదు, ఆదర్శం వల్ల అలాకాదు. ఆదర్శాలు ఎన్నటికీ మూలపరివర్తనని తీసుకురాలేవు. అవి తెచ్చేది కొద్ది మార్పులతో కొనసాగే పాతది మాత్రమే. క్షణక్షణమూ తీసుకునే చర్య వల్లనే మూల పరివర్తన సంభవిస్తుంది. అది ఆదర్శం మీద ఆధారపడి ఉండదు. అందువల్ల నిశ్చితాభిప్రాయానికి బంధింపబడి ఉండదు.

"కానీ, ప్రభుత్వం ఈ సూత్రం ప్రకారం వ్యవహరించలేదు. ఒక లక్ష్యం, ఒక ప్రణాళిక ప్రకారం కార్యాచరణ జరగాలి. ఒక సమస్య విషయమై దీక్షతో కూడిన కృషి ఉండాలి. నా మటుకు నాకు అందులో గొప్ప అవకాశాలున్నట్లు