Jump to content

పుట:Mahendrajalam.djvu/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ గ్రుడ్డును సీసా మ్రింగుతుందని చెప్పి - ఒక కర్పూరపు బిళ్ళను వెలిగించి, వెంటనే ఆ సీసాలోవేసి - ఆ సీసా మూతిలో ఉడికించిన గ్రుడ్డును వుంచాలి. అప్పుడు ఆ గ్రుడ్డును సీసా లోనికి లాగి వేస్తుంది. ఇది చూసిన వారికి ఎంతో అద్భుతంగా వుంటుంది.

ఈ ప్రదర్శనకు అసలు కీలకమంతా సీసాలో వేసిన మండే కర్పూరపు బిళ్ళలోనే వుంది. అలా సీసాలో కర్పూరపు బిళ్ళే కాకుండా మండే కాగితం వేసినా ఇలాగే జరుగుతుంది.

నాట్యం చేసే నాణెం

ఈ ప్రదర్శనకు ముందుగా అప్పుడే త్రాగిన లింకా సీసా గాని, ఆరంజ్ జ్యూస్ సీసా గాని తీసుకొని దానిమీద అర్థరూపాయి నాణేన్ని పెట్టి - రెండు చేతులతో సీసాని పాట్టుకొని - మంత్రాలు చదవడం (అలా నటించడం) ప్రారంభించిన అర నిమిషానికి సీసా పైన వున్న నాణెం ఎగరటం ప్రారంభిస్తుంది. దాన్ని చేతులలో నుండి తీసి టేబుల్ మీద పెట్టినను - అలా ఎగురుతూనే వుంటుంది. మీ అపూర్వ మయిన మంత్ర మహిమను చూచి - ప్రేక్షకులు ఎంతో ఉద్వేగం చెందుతారు.

దీనికి ప్రదర్శకుడు పెద్దగా కష్ట పడవలసిన పని లేదు. సీసా మీద నాణెమును పెట్టినప్పుడు గాలి చొరని విధంగా అనగా సీసా అంచుల మీద తడి కొంచెం ఎక్కువ ఉండేలాచూసి పెట్టాలి. ఇక నాణెం ఎగరడానికి మీరు చేసే ముఖ్య