పుట:Mahendrajalam.djvu/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గంటలలో పూవు యొక్క సహజమైన రంగును కోల్పోయి, గ్లాస్ లలోని ఒక రంగులోకి మారిపోతుంది. ఈ పూవు సగం ఒక గ్లాసులోని ఒక రంగులోకి మిగిలిన మరో సగం మరొక గ్లాసులోని మరో రంగులోకి మారుతుంది.

ఈ ప్రదర్శన చేయువారు సమయానుకూలంగా మాటలు చెపుతూ -తన మహిమ అనో మరోటనో చెప్పి చేయవచ్చును.

పటిక బెల్లం ముక్కను దీపంలా వెలిగించుట

ప్రదర్శకుడు ఒక పటిక బెల్లం (పంచదార గడ్డ ముక్కను ప్రేక్షకులకు చూపి - నా మంత్ర మహిమతో దీన్ని మండిస్తానని చెప్పి, అగ్గి పుల్ల గీసి అంటించగానే అది అంటుకొని దీపంలా వెలుగుతుంది. ఇది చూచిన వారు మీ శక్తికి ఎంతో ఆశ్చర్య పోతారు.

ఇది ప్రదర్శించు వారు ముందుగా పటిక బెల్లపు ముక్కకు ఒక వైపు సిగరెట్ నుసిని పట్టించి వుంచుకోవాలి. అలా నుసి పట్టించనిచో పంచదార గడ్డ ఎంత ప్రయత్నించినా మండదు. అగ్గిపుల్ల మంటను నుసి రాసిన చోటనే అంటింఛటం మరచి పోరాదు.

గ్రుడ్డును మ్రింగివేసే సీసా

ప్రదర్శకుడు ఒక గ్రుడ్డును ఉడికించి, దానిపైన వుండే పెంకును తీసి, శుబ్రం చేసుకొని వుంచాలి. తరువాత ఒక మిల్క్ సీసాను ప్రేక్షకులకు చూపి - నా మంత్ర మహిమతో