Jump to content

పుట:Mahendrajalam.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులతో చెప్పి, ఇసుకను గుప్పిడతో నోట్లో వేసుకొని కసా బిసా నమిలి ఊసినచో - చూచిన వారు చాలా ఆశ్చర్యం పొందుతారు.

ఈ ప్రదర్శనకు ముందుగా చేయవలసినది - గురువింద ఆకులను నోటిలో వుంచుకోవాలి. మాట్లాడునప్పుడు ఆకులను చూచువారికి కనుపించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆకులు నోటిలో వుంచుకొని ఇసుకను నమిలినచో - ఇసుకకు సహజంగా వుండే గరుకుతనము వుండదు.

గానుగ (క్రషర్) ఎంత త్రిప్పినను నూనె రాకుండ చేయుట

ఉత్తరేణి సమూలమును (వేరును) దంచి మెత్తగా పొడిచేసి - ఆ పొడిని గానుగ అడుగు భాగములో వేసి, తరువాత గానుగ ఆడించాలి. ఆ తదుపరి గానుగలో - నువ్వులు గాని, వేరుసెనగలు గాని వేసి ఎంత త్రిప్పినా నూనెరాదు. మరలా గానుగలో వేసిన ఉత్తరేణి పొడిని శుభ్రంగా కడిగేంత వరకు నూనెరానేరాదు.

నీళ్ళలో కలిపిన పసుపును నీటినుండి వేరు చేయుట

ఒక పాత్రలో నీరు తెప్పించి, ఇందులో పసుపు కలిపి చూపించి - ప్రేక్షకులకు "నా మంత్ర ప్రభావముతో మరలా పసుపును బయటికి తీస్తానని" చెప్పి, విభూతిని మంత్రించి (అట్లు నటించి) ఆ నీటిలో వేయగానే - పసుపు ముద్దగా నీటిలో తేలియాడును.