వేసే టప్పుడు ఎక్కడ వేస్తున్నామో వెలుగురు వలన తెలియదు. ముఖ్యంగా గది - పగలు కూడ కిటికీలు, తేలుపులు మూసి వేస్తే బాగా చీకటిగా వుండే గదై వుండాలి.
పాము తలమీద కప్ప
ప్రదర్శనకు బజారులో అమ్మే ప్లాస్టిక్ పాము ఒకటి, ప్లాస్తిక్ కప్ప ఒకటి తీసుకోవాలి. పాము తలపై భాగంలో నేర్పుగా కోసి శక్తి వంతమైన అయస్కాంతాన్ని అంటించాలి. అలాగే కప్ప అడుగు భాగంలో కూడ మాగ్నెట్ (అయస్కాంతం) ను అంటించాలి. అవి ఆకర్షించుకొనే పరిధిని ముందుగానే పరీక్ష చేసుకొని చూడాలి. పాము, కప్పకంటే బరువు వుండేదిగా ముందే చూసుకోవాలి. అలాగయితేనే కప్ప వెళ్ళి పాము తలమీద కూర్చొన గలగుతుంది. రెండూ సమానమయిన బరువయినచో - పాముకి పెట్టిన అయస్కాంతము బరువుగా వుండాలి. లేక పోతే రెండు కదలి ముందుకు వచ్చిన తరువాత మాత్రమే కప్ప, పాము తలమీద కూర్చుంటుంది. ఈ ప్రదర్శన కొద్ది మార్పులతో కప్పను మ్రింగే పాముగా కూడ మార్చు కోవచ్చును. ఎలాగంటే నోరు పెద్దగా తెరుచుకొని వున్న పాము (పాము తోలుతో) ను తయారు చేసుకొని కప్పను పాము కంటే బరువుగా వుండేటట్లు చూసుకొంటే - పామే కప్ప దగ్గరకు ప్రాకుతూ వచ్చి; దాన్ని నోట కరుచుకుంటుంది. అయితే కప్ప బొమ్మ మాత్రం పాము నోటిలో పట్టేటట్లుగా వుండాలి.