పుట:Mahendrajalam.djvu/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రొట్టెల మధ్యన పిచ్చుకను బంధించిన తరువాత ఆలస్యము జరిగితే పిచ్చుక ప్రాణానికి హాని కలుగుతుంది. రొట్టెలు తయారు చేసేటపుడే పొయ్యిమీద సన్నని సెగతో నూనె వేడి చేస్తూ వుండాలి. ఇంకొక విషయం రొట్టెలు తయారు చేసిన తరువాత మాత్రమే పిచ్చుకను వైన్ లో ముంచాలి.

చీకట్లో భగవాన్

ప్రదర్శకుడు ప్రేక్షకులతో దేవుడ్ని నేను చూడాలనుకుంటే చూడగలను. మీకు చూపాలనుకుంటే చూపగలను. మీకు ఇప్పుడు నా ఇష్టదైవాన్ని చూపుతాను. అని చెప్పి ముందుగా ఏర్పాటు చేసుకొన్న గదిలోకి వారిని తీసుకెళ్ళి తలుపులు, కిటికీలు మూసి వేసి కొంచెం సేపు ధ్యానం చేసి తన అసిస్టెంట్ తో లైట్లన్నీ తీసి వేయించగానే గోడ మీద ఆశ్చర్యకరంగా భగవంతుడు దర్శనం ఇస్తాడు. మరల లైట్లు వేయగానే భగవంతుడు అదృశ్యమవుతాడు.

ఈ ప్రదర్శనకు ముందుగా రేడియం ఫిష్ (చీకటిలో మెరిసే చేప) అనే చేపల యొక్క పొట్టు (పొలుసు ) ను తెచ్చి (పచ్చిగానే వుండాలి. తడి ఆరగూడదు) మెత్తగా నూరుతూ "ఈథర్ అనే ద్రావకాన్ని పోయాలి. ఆ తరువాత దాన్ని మంచి గాజు సీసాలో పోసుకొని భద్ర పరచుకోవాలి. సమయం వచ్చి నప్పుడు ఈ మిశ్రమ పదార్థంతో మనకు ఇష్టమైన బొమ్మను గోడ మీద వేసుకోవాలి. బొమ్మ వేసేటప్పుడు కూడ చీకటిలోనే వేయాలి. లేకపోతే ఈ ద్రవం గోడ మీద