ప్రదర్శకుడు ముందుగా ఖాళీ మందు గొట్టాలు (మెడికల్ షాపులలో దొరుకును) తీసుకొని వాటి నిండా బ్రాంది పోసి మూతలు బిగించి వుంచుకోవాలి. తదుపరి ప్రదర్శనలో అలా బ్రాంది పోసిన గొట్టము నొకదాన్ని నేర్పుగా చేతి ప్రేళ్ళ సందులలో ఇరికించుకొని - పూలు వేయునప్పుడో లేక పూలు తీయు నప్పుడో, కలుపునప్పుడో ఆ గొట్టాన్ని దానిలో జార విడిచిన ఆ గొట్టము వేడినీటిలో కరిగి పోయి, దానిలోని బ్రాంది నీటిలో కలసి ఆ నీరంతా బ్రాందీ రుచిని సంతరించుకొంటుంది. ఇలాగే విస్కీ, రమ్ము, సారాలను కూడ సమయానుకూలంగా వినియోగించవచ్చును.
పాలలో ఎన్ని నీళ్ళు
ఇంద్ర జాలికుడు సభికులలో మీలో ఎవరయినా పాలు తీసుకురండి.... ఆపాలలో ఉన్న నీటిని తీసి మీకు చూపిస్తానని చెప్పి, వారు పాలు తీసుకు రాగానే ఆ పాలలో మహిమ (బూటకము) గల విభూదిని వేసి పొయ్యిమీద వేడి చేయగానే పాలు ఆవిరి అయిపోయి, పాలలో వుండే నీరు మాత్రమే మిగిలిపోయి, చూచు వరు మిక్కిలి ఆనంద పడతారు.
ఈ ప్రద్ర్శనకు ముందుగా తామర గింజలను తెచ్చి ఎండబెట్టి పొడిగా (మెత్తగా) చేసి వుంచుకొని ప్రదర్శనసమయంలో దానిని విభూదిలా పాలలో వేసిన పాలలో నీరు మాత్రమే మిగులుతుంది.