పుట:Mahendrajalam.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మండకుండా (మంట పెట్టకుండా) అన్నం తయార్

ప్రదర్శకుడు తన దగ్గర సిద్ధంగా వున్న బియ్యాన్ని చూపి - మంత్ర మహిమతో ఈ బియ్యాన్ని మంట (పొయ్యి) లేకుండానే ఉడికిస్తానని చెప్పి - ఆ బియ్యాన్ని ఒక పాత్రలో పోసి, మంత్రిస్తూ (నటిస్తూ) నీరు పోసిన వెంటనే ఆ బియ్యం కుతకుతా ఉడికి అన్నం తయారవుతుంది. ఇది చూచిన వారికి ఎంతో అద్భుతంగా వుంటుంది.

ఈ ప్రదర్శనకు ముందుగా తగినన్ని బియ్యాన్ని దెచ్చి వాటిని సున్నంబట్టిలో గొయ్యితీసి పాతి పెట్టాలి. తరువాత సున్నం బట్టి చల్లారి పోతుంది. అప్పుడు బియ్యాన్ని తీసి భద్రపరచుకొని ప్రదర్శన సమయంలో పైన చెప్పిన విధంగా చేసినచో అన్నం తయారవుతుంది. ఈ విధంగా బియ్యమే కాకుండా జొన్నలు, తైదులు, సజ్జలు, గోదుమలు మొదలగు ఆహార పదార్థములకు పనికి వచ్చు ఏ గింజలనయినా ప్రయోగానికి వినియోగించ వచ్చు.


టెంకాయ బాంబులా ప్రేలుట

ప్రదర్శకుడు ఒక టెంకాయను చూపి - నాశక్తితొ దీన్ని బాంబులాగా ప్రేల్చి వేస్తానని చెప్పి కొంత సేపు ధ్యానంలో వుండి మంత్రించిన (నటించి) కొబ్బరికాయ మీద నీరు పోయవలెను. వెంటనే ఆ టెంకాయ బాంబువలే ప్రేలి పోగలదు. ఈ ప్రదర్శన తిలకించిన వారు భయ - భ్రాంతులై అనంద పడగలరు.