పుట:Mahendrajalam.djvu/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విభూదిలోనో, సిందూరంలోనో కలిపి జాగ్రత్తగా భద్రపరచుకొని, ప్రదర్శన సమయంలో - దానిని వచ్చిన వ్యక్తికి బొట్టు పెట్టి - " తదేకంగా నా కళ్ళలోకి చూడు " అనో లేక ఏదయినా వస్తువును గాని, చిత్రములను గాని చూడమనో చెప్పి - తను ధ్యానం చేసినట్లుగా కొంచెంసేపు నటిస్తే - ఈ లోపులో మూలిక పనిచేసి ఆతను సుఖనిద్రలోకి జారిపోతాడు.

నూనెను పాలుగా మార్చుట

ప్రదర్శకుడు ప్రేక్షకులాతో ఎలాంటి వంట నూనెనైనా పాలుగా మారుస్తానని చెప్పి - అనుమానం లేకుండా నూనెను వారినే తెమ్మని చెప్పాలి. వారు నూనె తేగానే - తన దగ్గర సిద్ధంగా వున్న క్షారాన్ని చాక చక్యంగా ఆనూనెలో కలిపిన వెంటనే పాలుగా మారి పోవును. ఈ ప్రదర్శన చాల వింతగా వుండును.

ఇది ప్రదర్శించు వారు ముండుగా ఉత్తరేణి వ్రేళ్ళను తెచ్చి, బాగా కాల్చి తెల్లగా పొడి చేయలి. ఆ పొడిని నీటిలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత కదలకుండా తేరుకోనివ్వాలి. మరు రోజు కొంత పొడి వేసి బాగా కలపాలి. తిరిగి కదలకుండా తేరుకోనివ్వాలి. ఇలా 7 - 8 రోజులు చేసినచో క్షారము తయారవుతుంది. దీనిని సీసాలో భద్ర పరచుకొని ప్రదర్శన సమయములో ఉపయోగించాలి.